Site icon NTV Telugu

David Warner : ఆ బూతులు వింటే మీరు చెవులు మూసుకుంటారు.. వార్నర్ రియాక్షన్

David

David

David Warner : రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ ను ఓ బూతు పదం అనేశాడు. అది ఎంత పెద్ద రచ్చ అయిందో మనకు తెలిసిందే. చివరకు ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. కావాలని అనలేదని.. పొరపాటున అనేశానని చెప్పుకొచ్చాడు. ఇదే విషయంపై తాజాగా డైరెక్టర్ వెంకీ కుడుముల రియాక్ట్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ..’రాజేంద్ర ప్రసాద్ మంచి నటుడు. వయసులో చాలా పెద్దవాడు. కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం. ఏమీ దాచుకోకుండా మాట్లాడుతుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు వార్నర్, రాజేంద్ర ప్రసాద్ చాలా క్లోజ్ అయ్యారు. ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారన్నారు.

Read Also : Bihar: లాలూ ప్రసాద్ యాదవ్‌కు భారతరత్న.. తిరస్కరించిన బీహార్ అసెంబ్లీ..

‘ఈవెంట్ లో అనుకోకుండా ఆయన మాటతూలారు. దానికి ఆయన కూడా బాధపడ్డారు. క్షమాపణలు చెప్పారు. ఇదే విషయంపై నేను డేవిడ్ వార్నర్ తో మాట్లాడాను. పెద్దవారు అనుకోకుండా అలా అనేశారు ఏమీ అనుకోవద్దు అన్నాను. దానికి వార్నర్ పాజటివ్ గా రియాక్ట్ అయ్యారు. మేం క్రికెట్ లో ఇంతకన్నా బూతులు వింటుంటాం. అక్కడ కావాలనే తిట్టుకుంటారు. ఇది సినిమాలో స్లెడ్జింగ్. చాలా చిన్నది అంతే అన్నాడు. దానికి నేను చాలా సంతోషించా. వార్నర్ చాలా మంచి వ్యక్తి’ అంటూ డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్పుకొచ్చారు. మార్చి 28న రాబిన్ హుడ్ థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Exit mobile version