Site icon NTV Telugu

Pushpa : వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు టైం ఫిక్స్

Pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన “పుష్ప: ది రైజ్” సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమా కంటే సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ మ్యానరిజమ్, డైలాగ్స్ సినీ ప్రియులను, అభిమానులను, అలాగే సెలెబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకి సిద్ధమైంది. తాజాగా ‘పుష్ప’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ లకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్.

Read Also : Radhe Shyam : కొత్త జీవో చిక్కులు… ఇంకా టికెట్స్ కౌంటర్స్ ఓపెన్ కాలేదు !!

ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ శాటిలైట్‌ హక్కులను మా టీవీ భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఛానల్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ‘పుష్ప’ ప్రీమియర్‌ని ప్రసారం చేయబోతోంది. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫహద్ ఫాజిల్ తదితరులు అత్యుత్తమ నటనను కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. మరోవైపు ‘పుష్ప-2’ ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు టీం. ఇక ఇప్పటికే ఓటిటిలో అలరించిన ‘పుష్ప’రాజ్ సందడి టీవీల్లో ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version