Site icon NTV Telugu

Dasara : నాని గ్యాంగ్ కు కష్టాలు !!

Dasara

Dasara

నేచురల్ స్టార్ నాని ఇప్పుడు “దసరా” షూటింగ్‌ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాకి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. “దసరా”లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. “దసరా” సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల కాగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అందులో నాని బాడీ ట్రాన్స్ఫార్మేషన్ అందరినీ షాక్ కు గురి చేసింది. ‘దసరా’కు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో “దసరా’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా షూటింగ్ లో బిజీగా ఉన్న నాని గ్యాంగ్ కు కష్టాలు మొదలయ్యాయట. షూటింగ్ కోసమని తెలంగాణలోని ఓ ప్రాంతానికి వెళ్లగా, అక్కడ సరైన వసతులు లేక ఇబ్బందులు పడ్డారట “దసరా” టీం.

Read Also : KGF Chapter 2 : బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్… మరో పార్ట్ లోడింగ్

ప్రస్తుతం ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో నాని, కీర్తి సురేష్ లపై ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని (తెలంగాణ)లో చిత్రీకరణ జరుగుతోంది. టీమ్ మొత్తం అధిక ఉష్ణోగ్రతలు, తేమలో చాలా కష్టపడి పని చేస్తోంది. ఈ పాట కోసం 500 మంది బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లతో కొరియోగ్రఫీ చేసి భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. అయితే గోదావరిఖనిలో పెద్దగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటివి లేకపోవడంతో… ఈ 500 మంది డ్యాన్సర్‌లతో పాటు జూనియర్ ఆర్టిస్టులకు వసతి కల్పించడానికిప్రభుత్వ అతిథి గృహాలు, ఇతర ప్రైవేట్‌ సంస్థలను, కల్యాణ మండపాలను బుక్‌ చేశారని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇది ఇబ్బంది మాత్రమే కాదు ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పాలి.

Exit mobile version