Site icon NTV Telugu

Das ka Dhamki: విశ్వక్ సేన్ ధమ్కీ ఇచ్చేది ఎప్పుడంటే….

Das

Das

Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ విడుదల తేదీ ఖరారైంది. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో మార్చి 22న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చగా, దినేశ్‌ కె బాబు సినిమాటోగ్రఫీ అందించారు. అన్వర్ అలీ ఎడిటర్. రావు రమేశ్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకూ విడుదలైన ప్రచార చిత్రం, పాటలకు విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా… సర్వాంగ సుందరంగా దీన్ని తీర్చిదిద్దడానికి కొంత గడువు తీసుకున్నాడు విశ్వక్ సేన్. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్ లో దీన్ని కరాటే రాజు నిర్మిస్తున్నారు. ‘ఫలక్ నుమా దాస్’ తర్వాత విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా ఇది. విశ్వక్ సేన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ!

Exit mobile version