Site icon NTV Telugu

Dhanush Vs Viswaksen: ‘సార్’కు ‘ధమ్కీ’ ఇవ్వబోతున్న విశ్వక్ సేన్!

Dhamki (1)

Dhamki (1)

Viswak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ ను అట్టహాసంగా నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఫలక్ నుమా దాస్’తో మాస్ ను అట్రాక్ట్ చేసిన విశ్వక్ సేన్, తాజా చిత్రం ‘ధమ్కీ’లోనూ అదే బాటలో సాగాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపుదిద్దుకున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. ఫిబ్రవరిలో ఈ మూవీని రిలీజ్ చేస్తామని ట్రైలర్ రిలీజ్ సమయంలో చెప్పారు.

తాజాగా ‘ధమ్కీ’ సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా జనం ముందుకు తీసుకొస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. విశేషం ఏమంటే… ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం చేసిన ‘ధమ్కీ’లో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. అయితే, ఈ సినిమా విడుదల రోజునే ధనుష్ బై లింగ్వల్ మూవీ ‘సార్’ కూడా రిలీజ్ కాబోతోంది. దీన్ని వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అలానే గీతా ఆర్ట్స్ సంస్థ కిరణ్‌ అబ్బవరంతో నిర్మిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ను కూడా ఫిబ్రవరి 17నే విడుదల చేయబోతున్నట్టు నిర్మాత బన్నీ వాసు ఇప్పటికే ప్రకటించారు. మరి ఈ ముక్కోణపు పోటీలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో చూడాలి.

Exit mobile version