మలయాళ నటి దర్శన రాజేంద్రన్ తన ఎంపికలతో ఎప్పుడూ ప్రత్యేకతను చూపిస్తూ ముందుకు సాగుతోంది. భాష అడ్డంకి కాదని, మంచి కథ ఉంటే ఎక్కడైనా నటిస్తానని ఆమె స్పష్టం చేసింది. ఇటీవల అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి నటించిన ‘పరదా’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శన, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read : Kalyani Priyadarshan : నాకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ కాల్ అతనికే చేస్తా ..
ఆమె మాట్లాడుతూ.. “నాకు తెలుగు అస్సలు రాకపోయినా, పరదా స్క్రిప్ట్ నన్ను ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమాలో నటించాను. భాషను తర్వాత నేర్చుకున్నా. మంచి కంటెంట్ ఉన్న కథ వస్తే భాషతో సంబంధం లేదు. మొదట్లో ఒక భాష రాకపోతే అందులో నటించడం కష్టం అనుకున్నా. కానీ ఇప్పుడు అనిపిస్తోంది మంచి స్క్రిప్ట్ ఉంటే ఏ భాషలోనైనా చేస్తా” అని తెలిపింది. అలాగే పాత్రల ఎంపిక పై తన అభిప్రాయం వెల్లడిస్తూ.. “ఒకే రకమైన పాత్రలను పదే పదే చేయడం నాకు ఇష్టం లేదు. ఆలా చేస్తే నా నటనలో వైవిధ్యం ఉండదు. స్క్రిప్ట్ విన్నప్పుడు అది నాకు సుపరిచితంగా అనిపిస్తే అటువంటి పాత్రలను తప్పించుకుంటాను. కానీ కొత్తదనం ఉన్న ప్రత్యేకమైన పాత్రలు వస్తే మాత్రం వాటికి ఎప్పుడూ నో చెప్పలేను” అని చెప్పుకొచ్చింది. దర్శన వ్యాఖ్యలు ఆమెకు ఉన్న కథ పట్ల ఉన్న ఆసక్తి, భిన్న తను వెతుక్కునే తపనను చూపుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ఆమె మరిన్ని విభిన్న భాషల్లో, విభిన్న పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని చెప్పవచ్చు.