Darshan Fed Non Veg to Vegetarian Actress: కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యను ఖండిస్తూ, నటుడు దర్శన్‌ను కఠినంగా శిక్షించాలని కొన్ని చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 8’ కంటెస్టెంట్, సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగి ఇప్పటికే నటుడు దర్శన్ గురించి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు అతను సోషల్ మీడియాలో మరింత సమాచారం షేర్ చేయడం కలకలం రేపుతుంది. ఈ రౌడీ బాస్ తాను లింగాయత్ అని, శాకాహారిని అని చెప్పినా వినకుండా అమాయకుడు రేణుకా స్వామిని బలవంతంగా నోటిలో బిర్యానీ కుక్కించి, హింసించి హత్య చేశాడు.
అదే విధంగా 3 సంవత్సరాల క్రితం, ఒక ప్రముఖ కన్నడ సినిమా నటి, అతనితో షూటింగ్ చేస్తున్నప్పుడు, శాఖాహారం కావాలని కోరింది. అయితే అతను మాత్రం ఆమె చెబుతున్న విషయాలను పట్టించుకోకుండా ఆమెకు భోజనం తీసుకువచ్చే వాళ్లకు మధ్యాహ్న భోజనంలో మిక్స్డ్ నాన్ వెజ్ సర్వ చేయాలని సూచించాడు. ఆమె తెలియకుండా నాన్ వెజ్ తినడంతో ఈ వ్యక్తి దుర్యోధనుడులా పగలబడి నవ్వాడని ఆయన ఆరోపించాడు.
అంతేకాదు కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడు మరియు టీవీ రియాల్టీ షోలో న్యాయనిర్ణేతగా ఉన్న నా స్నేహితుడికి 2 సంవత్సరాల క్రితం గుండెపోటు వచ్చింది. దీనికి కారణం అదే ఆరడుగుల మృగం, రౌడీ బాస్ (డి బాస్ ఇప్పుడు రౌడీ బాస్) నుండి బెదిరింపు కాల్, మానసిక ఆందోళన అని ఆయన అన్నాడు. ‘‘నేను చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు గడిపా కానీ నేను దర్శన్‌తో సెల్ఫీ తీసుకోలేదు, సినిమా చేయలేదు, కల వలేదు. “దేవుడు నన్ను చెడు నుండి దూరం చేసాడు” అని ప్రశాంత్ సంబరగి కామెంట్ చేశారు.