Dhanush: కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్- ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు ప్రకటించి చాలా నెలలు అయ్యింది. ఇక వీరిద్దరూ ప్రస్తుతం తమ తమ కెరీర్ లో బిజీగా కూడా మారారు. అయితే ఈ జంట మధ్య సంధి కుదిరిందని, విడాకులు రద్దు చేసుకుంటున్నారని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదని కొందరు అంటుండగా.. నిజమే అని మరికొందరు అంటున్నారు. అసలు మాకు కలిసి ఉండే ఉద్దేశ్యమే లేదని ఈ జంట చాలా క్లియర్ కట్ గా చెప్పుకొచ్చేసింది. మధ్య మధ్యలో ఈ జంట పిల్లలకోసం కలవడంతో వీరు మళ్లీ కలుస్తున్నారని పుకార్లు మొదలయ్యాయి.
తాజాగా ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసే వార్త బయటికి వచ్చింది.. అదేంటంటే.. ఈ స్టార్ కపుల్ రూ. 100 కోట్ల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేశారట. వచ్చే ఏడాది జనవరిలో ఈ జంట తమ పిల్లలతో సహా ఆ ఇంటిలోకి షిఫ్ట్ అవుతున్నారని టాక్ నడుస్తోంది. తమ పిల్లలు యాత్రా రాజా, లింగ రాజా కోసం ఈ జంట కలిసిందని, ఇక నుంచి కొత్త ఇంట్లో కొత్త జీవితాన్ని మొదలుపెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. ఒకవేళ నిజమైతే అంతకన్నా సంతోషం ఏముంటుందని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ధనుష్ తెలుగులో సార్ సినిమాలో నటిస్తున్నాడు.