తెలుగులో రొమాంటిక్ క్రైమ్ డ్రామాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. దానికి తోడు కాస్త బోల్డ్ అండ్ రస్టిక్ ఎలిమెంట్స్ తోడైతే యూత్ కు ఇక పండగే. సరిగ్గా ఇదే ఫార్ములాతో తెరకెక్కిన తాజా చిత్రం ‘డానీ’ (Danny). తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ వదిలిన ‘ఫస్ట్ స్ట్రైక్’ (టీజర్) ఇప్పుడు నెట్టింట సెగలు రేపుతోంది. ముఖ్యంగా టీజర్ లోని బోల్డ్ డైలాగ్స్, బీచ్ రొమాన్స్ కుర్రకారును విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. “నువ్వు బీచ్‌కి ఎప్పుడూ ఒంటరిగా వస్తావా?” అని హీరోయిన్ అడిగితే.. దానికి హీరో “నేను బీచ్‌కి రావాలంటే కచ్చితంగా అమ్మాయి ఉండాల్సిందే” అంటూ చెప్పే డైలాగ్ సినిమాలో రొమాన్స్ ఏ రేంజ్ లో ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది.
‘నాటకం’, ‘కళింగ’ లాంటి రా అండ్ రస్టిక్ సినిమాలతో విజయాలు అందుకున్న హీరో ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్‌జీ గోగన కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుండటం అంచనాలను పెంచుతోంది. ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన ఈ సక్సెస్ ఫుల్ కాంబో.. ఈసారి క్రైమ్, యాక్షన్ కు తోడు డోస్ పెంచిన రొమాన్స్ ను కూడా జోడించి ‘డానీ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టీజర్ లోని యాక్షన్ విజువల్స్, గ్లామర్ షో చూస్తుంటే పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టేలానే కనిపిస్తున్నారు. ఆశిష్ గాంధీ సరసన సేజల్ గుప్తా, సోనాల్ సింగ్ హీరోయిన్లుగా తమ అందాలతో కనువిందు చేయనుండగా.. అజర్ ఖాన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్‌లపై కొల్లి గోపాల కృష్ణ సమర్పణలో రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ స్ట్రైక్ కు సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఏకే ఆనంద్ సినిమాటోగ్రఫీ, రామ్ సుంకర యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకు రిచ్ అండ్ రస్టిక్ లుక్ ను తీసుకొచ్చాయి. ఖుషి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్న మేకర్స్.. ఈ బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ డ్రామాను అక్టోబర్ నెలలో గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి బోల్డ్ డైలాగులతో వచ్చిన ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది.

