Site icon NTV Telugu

బిగ్ బ్రేకింగ్: శివశంకర్ మాస్టర్ కి కరోనా.. పరిస్థితి విషమం

shiva shankar master

shiva shankar master

టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. శివ శంకర్ మాస్టర్ ఆసుపత్రి బిల్లులు చాలా ఖర్చుతో కూడుకున్నాయని, ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అంత ఆర్థిక స్తోమత లేనందున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా ఆయన కుమారుడు అజయ్ కృష్ణ మాస్టర్ కోరుతున్నారు. శివ శంకర్ మాస్టర్ డాన్స్‌‌కి తెలుగులోనే కాకుండా తమిళ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ‘మగధీర’, ‘బాహుబలి’, ‘అత్తారింటికి దారేది’ ఇలా వందలాది చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇక డాన్స్ మాస్టర్ గా కాకుండా నటుడుగా కూడా పలు సినిమాలలో కనిపించారు.

Exit mobile version