Tollywood : ‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ దక్కన్ సర్కార్. తాజాగా దక్కన్ సర్కార్ పోస్టర్, టీజర్ లాంచ్ కార్యక్రమం తెలుగు ఫిలిం ఛాంబర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొని చిత్రయూనిట్‌ను అభినందించారు.
తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి మాట్లాడుతూ.. ”తెలంగాణ ఉద్యమంలోని కష్టాలను ఈ సినిమాలో చూపించారు. ఉద్యమంలో పని చేసిన కళా శ్రీనివాస్ ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి ఈ సినిమా తీశాడు. ఉద్యమాన్ని చూపిస్తున్న ఇలాంటి సినిమాను ప్రతి ఒక్కరు ఆదరించాలి. చిత్రయూనిట్‌ను అభినందిస్తున్నాను.” అని అన్నారు.
Also Read
డైరెక్టర్ కళా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్పది, ఇక్కడి ప్రకృతి ఎంతో బాగుంటుంది. తెలంగాణలో ప్రతి అంశంపై సినిమా తీయొచ్చు. తెలంగాణ సినిమాలు ఇంకా ఎన్నో రావాల్సి ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని తెరపై ఆవిష్కరించాము. నిజ జీవితంలో మంచి క్యారెక్టర్ ఉన్న వారినే సినిమాలో క్యారెక్టర్లుగా తీసుకున్నాను. పోరాటాలకు విరామం ఉండదనే కాన్సెఫ్టుతో ఈ సినిమా చేశాను. సాయి చంద్, జై శ్రీను వంటి తెలంగాణ ఆణిముత్యాలను కోల్పోయాం. ఉద్యమ కళాకారులను, నా ఆత్మీయులను ఈ సందర్భంగా తలుచుకోవడం భావోద్వేగంగా ఉంది. ‘దక్కన్ సర్కార్’ ఆడియో లాంచ్ త్వరలో నిజామాబాద్‌లో భారీగా నిర్వహించబోతున్నాము. ఈ సినిమాను ఆదరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మా సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ కార్యక్రమంకు వచ్చిన అతిథులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మీడియా మిత్రులకు పేరుపేరున కృతజ్ఞతలు ” అని అన్నారు.
తాజావార్తలు
-
Lucknow Tragedy: లక్నో విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్
-
Fast Food Side Effects: పళ్ల సమస్యల నుంచి క్యాన్సర్ వరకు.. ఫాస్ట్ ఫుడ్ ప్రభావం.. నిపుణుల హెచ్చరిక
-
Chiru 158 : “జీవించేశారు అన్నయ్యా!”.. మెగాస్టార్ యాక్టింగ్‌కు డైరెక్టర్ బాబీ ఎమోషనల్
-
ICC Rules: వెస్టిండీస్ స్టార్ ‘ఎఫీ ఫ్లెచర్’ స్ఫూర్తితో.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భారీ ఊరట..
-
Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్‌బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!