NTV Telugu Site icon

Rana Naidu 2: దగ్గుబాటి బాయ్స్ మళ్లీ వస్తున్నారు… ఇంత జరిగాకా కూడానా?

Rana Naidu 2

Rana Naidu 2

ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఫ్యామిలీ హీరో అనగానే అప్పట్లో శోభన్ బాబు, ఇప్పుడు విక్టరీ వెంకటేష్ లు మాత్రమే గుర్తొస్తారు. తమ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి ఫ్యామిలీ మొత్తాన్ని తమ ఫాన్స్ గా చేసుకున్నారు శోభన్ బాబు, వెంకటేష్ లు. ముఖ్యంగా వెంకటేష్ ఎక్కువ శాతం సినిమాలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలతోనే చేశాడు, అందుకే వెంకటేష్ సినిమా వస్తుంది అంటే మొదటి రోజు మొదటి షోకి కూడా లేడీ ఫాన్స్ థియేటర్ దగ్గర కనిపిస్తారు. ఎలాంటి కాంట్రవర్సీలకీ పోకుండా, ఎలాంటి గొడవలూ చెయ్యకుండా సైలెంట్ గా తమ హీరో సినిమా రిలీజ్ అయితే చేసేసి వచ్చేసే అంతటి డీసెంట్ ఫ్యాన్ ని ఫాలోయింగ్ ని గత ముప్పై సంవత్సరాలుగా మైంటైన్ చేస్తున్నాడు వెంకటేష్. సింపుల్ గా చెప్పాలి అంటే వెంకటేష్ కి ఉన్నంత ఫ్యామిలీ హీరో ఇమేజ్ మరొకరికి లేదు. అలాంటి ఇమేజ్ ని ఒక్క వెబ్ సీరీస్ చెల్లా చెదురు చేసింది. వెంకటేష్‌కు ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ అంతా డ్యామేజ్ చేసింది ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌. వెంకటేష్, రానా బోల్డ్‌నెస్ చూసి తెలుగు అభిమానులంతా అంతా షాక్ అయ్యారు. అసలు వీళ్లు మన హీరోలేనా? వారం పది రోజుల పాటు రానా నాయుడు వెబ్ సీరీస్ లోని బూతు సీన్ల గురించే చర్చ జరిగింది అంటే ఈ సీరీస్ ఎలాంటి రచ్చని సృష్టించిందో అర్ధం చేసుకోవచ్చు.

ముఖ్యంగా స్టార్టింగ్ ఎపిసొడ్‌ అయితే బ్లూ ఫిల్మ్‌లా ఉందనే విమర్శలు విపరీతంగా వినిపించాయి. వెంకటేష్ డైలాగ్స్ మరీ ఎబ్బెట్టుగా, అసహ్యంగా ఉన్నాయి తెలుగులో ఈ సిరీస్‌ను ఆపేయాలని అన్నారు. ఈ సీరీస్ ఇచ్చిన షాక్ నుంచి కొంతమంది ఇంకా తేరుకోని ఉండరు, అలాంటి వాళ్లకి హార్ట్ ఎటాక్ ఇచ్చే రేంజులో ‘రానా నాయుడు 2’ని అనౌన్స్ చేసింది నెట్ ఫ్లిక్స్. “Don’t worry, the Naidus are coming back to sort out all your kiri kiri.. #RanaNaidu season 2 is coming soon!” అంటూ ట్వీట్ చేసిన నెట్ ఫ్లిక్స్, ఒక చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సిరీస్‌ను రిలీజ్ చేయాలనుకుంటే అడల్ట్ కంటెంట్ తగ్గించాలని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, అసలు ఈ బోల్డ్ సిరీస్ అవసరమా? అనే కామెంట్స్ ఇంకా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎవరు కావాలి అనుకున్నా, ఎవరు వద్దూ అనుకున్నా రానా నాయుడు 2 అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి ఈసారి దగ్గుబాటి బాబాయ్-అబ్బాయిలు ‘రానా నాయుడు 2’తో ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి.

Show comments