Rana Naidu 2: దగ్గుబాటి బాయ్స్ మళ్లీ వస్తున్నారు… ఇంత జరిగాకా కూడానా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఫ్యామిలీ హీరో అనగానే అప్పట్లో శోభన్ బాబు, ఇప్పుడు విక్టరీ వెంకటేష్ లు మాత్రమే గుర్తొస్తారు. తమ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి ఫ్యామిలీ మొత్తాన్ని తమ ఫాన్స్ గా చేసుకున్నారు శోభన్ బాబు, వెంకటేష్ లు. ముఖ్యంగా వెంకటేష్ ఎక్కువ శాతం సినిమాలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలతోనే చేశాడు, అందుకే వెంకటేష్ సినిమా వస్తుంది అంటే మొదటి రోజు మొదటి షోకి కూడా లేడీ ఫాన్స్ థియేటర్ దగ్గర కనిపిస్తారు. ఎలాంటి కాంట్రవర్సీలకీ పోకుండా, ఎలాంటి గొడవలూ చెయ్యకుండా సైలెంట్ గా తమ హీరో సినిమా రిలీజ్ అయితే చేసేసి వచ్చేసే అంతటి డీసెంట్ ఫ్యాన్ ని ఫాలోయింగ్ ని గత ముప్పై సంవత్సరాలుగా మైంటైన్ చేస్తున్నాడు వెంకటేష్. సింపుల్ గా చెప్పాలి అంటే వెంకటేష్ కి ఉన్నంత ఫ్యామిలీ హీరో ఇమేజ్ మరొకరికి లేదు. అలాంటి ఇమేజ్ ని ఒక్క వెబ్ సీరీస్ చెల్లా చెదురు చేసింది. వెంకటేష్‌కు ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ అంతా డ్యామేజ్ చేసింది ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్. వెంకటేష్, రానా బోల్డ్నెస్ చూసి తెలుగు అభిమానులంతా అంతా షాక్ అయ్యారు. అసలు వీళ్లు మన హీరోలేనా? వారం పది రోజుల పాటు రానా నాయుడు వెబ్ సీరీస్ లోని బూతు సీన్ల గురించే చర్చ జరిగింది అంటే ఈ సీరీస్ ఎలాంటి రచ్చని సృష్టించిందో అర్ధం చేసుకోవచ్చు.
ముఖ్యంగా స్టార్టింగ్ ఎపిసొడ్ అయితే బ్లూ ఫిల్మ్‌లా ఉందనే విమర్శలు విపరీతంగా వినిపించాయి. వెంకటేష్ డైలాగ్స్ మరీ ఎబ్బెట్టుగా, అసహ్యంగా ఉన్నాయి తెలుగులో ఈ సిరీస్‌ను ఆపేయాలని అన్నారు. ఈ సీరీస్ ఇచ్చిన షాక్ నుంచి కొంతమంది ఇంకా తేరుకోని ఉండరు, అలాంటి వాళ్లకి హార్ట్ ఎటాక్ ఇచ్చే రేంజులో ‘రానా నాయుడు 2’ని అనౌన్స్ చేసింది నెట్ ఫ్లిక్స్. “Don’t worry, the Naidus are coming back to sort out all your kiri kiri.. #RanaNaidu season 2 is coming soon!” అంటూ ట్వీట్ చేసిన నెట్ ఫ్లిక్స్, ఒక చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సిరీస్‌ను రిలీజ్ చేయాలనుకుంటే అడల్ట్ కంటెంట్ తగ్గించాలని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, అసలు ఈ బోల్డ్ సిరీస్ అవసరమా? అనే కామెంట్స్ ఇంకా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎవరు కావాలి అనుకున్నా, ఎవరు వద్దూ అనుకున్నా రానా నాయుడు 2 అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి ఈసారి దగ్గుబాటి బాబాయ్-అబ్బాయిలు ‘రానా నాయుడు 2’తో ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
Don’t worry, the Naidus are coming back to sort out all your kiri kiri ♥🔥#RanaNaidu season 2 is coming soon! pic.twitter.com/KVJDrIB5wH
— Netflix India (@NetflixIndia) April 19, 2023
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!