పుష్ప.. పుష్ప రాజ్ మ్యానియా మొదలయ్యింది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదలై హిట్ టాక్ ని అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఎక్కడ విన్నా.. ఎక్కడా చూసినా పుష్పనే కనిపిస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ పోలీసులు సైతం పుష్ప పేరే కలవరిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తకొత్త పద్దతులతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమదైన రీతిలో పుష్ప పోస్టర్ ని వాడుకున్నారు.. పుష్ప పోస్టర్ లో బైక్ పై నిలబడిన అల్లు అర్జున్ ఫోటోను షేర్ చేస్తూ.. ట్రైలర్ ఫేమస్ అయినా పార్టీ లేదా పుష్ప డైలాగుని మార్చి.. హెడ్ లైట్స్, సైడ్ మిర్రర్స్ లేవా పుష్ప అంటూ మీమ్ రూపంలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారుతోంది. మారుతున్న ప్రజల అభిరుచులను బట్టి.. పోలీసులు సైతం మారి వారి రూట్లోనే వెళ్లడం బావుందని నెటిజన్లు అభినందిస్తున్నారు.
బన్నీకి షాకిచ్చిన పోలీసులు.. అవి ఎక్కడంటూ ప్రశ్నలు..?

allu arjun