NTV Telugu Site icon

Anjali: చరణ్ సినిమా తరువాత అంజలి పెళ్లి..?

Anjali

Anjali

Anjali: షాపింగ్ మాల్ సినిమాతో అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకొంది తెలుగమ్మాయి అంజలి. ఈ సినిమా తరువాత తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. ఇక మధ్యమధ్యలో ఐటెం సాంగ్స్ చేస్తూ కూడా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం అంజలి.. చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న RC15 లో నటిస్తోంది. పాన్ ఇండియా సినిమా కావడంతో అమ్మడికి మంచి పేరు వచ్చేలానే కనిపిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మ పెళ్లి కబురు చెప్పనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో చాలాసార్లు అంజలి పెళ్లి గురించి వార్తలు వినిపించిన విషయం తెల్సిందే. అయితే ఆ పెళ్లి వార్తలను ఎప్పటికప్పుడు ఆమె ఖండిస్తూనే వస్తుంది. ఇక ఇప్పుడు మాత్రం అంజలి పెళ్లి వార్తలు నిజమే అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అంజలి తల్లిదండ్రులు ఆమెకోసం సరైన వరుడును వెతికే పనిలో ఉన్నారట. ఇక మ్యాచ్ కనుక సెట్ అయితే ఈ ఏడాది చివర్లోనే అంజలి పెళ్లి పీటలు ఎక్కనుందన్నమాటే.

Bellemkonda Srinivas: బాలీవుడ్ ‘ఛత్రపతి’ గానే బెల్లంకొండ!

సినిమాల పరంగా కాకుండా. వ్యక్తిగతంగా అంజలి గురించి చెప్పుకురావాలంటే ఆమె వెనువెంటనే వివాదాలు నడుస్తూ వచ్చాయి. కుటుంబంతో గొడవలు.. పోలీస్ కేసు.. కిడ్నాప్ అంటూ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కోలీవుడ్ హీరోతో డేటింగ్, పెళ్లి అంటూ వచ్చిన పుకార్లు సైతం హాట్ టాపిక్ గా మారాయి. వీటిని ఏవి మైండ్ లో పెట్టుకోకుండా అంజలి తనపని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కొద్దిగా బరువు పెరిగి అవకాశాలు రావడం లేదని తెలిసి.. ప్రస్తుతం నాజూకుగా మారి అమ్మడు షాక్ ఇస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మను పెళ్లాడే వరుడు ఎక్కడ ఉన్నాడో తెలియాల్సి ఉంది.

Show comments