Site icon NTV Telugu

VD13: విజయ్ VD13 నుంచి క్రేజీ అప్డేట్.. నెక్ట్స్ అక్కడే!

Vd13 Crazy Update

Vd13 Crazy Update

Crazy Update From VD13 Movie Unit: ‘లైగర్’ సినిమా తనకు మిగిల్చిన ఘోర పరాభావం కారణంగా.. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఏ జోనర్ అయితే తనకు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ తెచ్చిపెట్టిందో, తిరిగి అదే ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్‌లో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే విజయ్ మరోసారి దర్శకుడు పరశురామ్‌తో చేతులు కలిపాడు. వీరి కాంబోలో ఇంతకుముందు ‘గీత గోవిందం’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి.. విజయ్ మార్కెట్‌ని పెంచడంతో పాటు పరశురామ్ కెరీర్‌ని మలుపు తిప్పింది కూడా. అయితే.. ఈ సినిమా తర్వాత ఇద్దరికీ మళ్లీ ఆ రేంజ్ హిట్ పడకపోవడంతో, మరోసారి ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేసేందుకు జోడీ కట్టారు.

Bro First Single: మై డియర్ మార్కండేయ… రికార్డ్స్ ని రఫ్ఫాడిద్దాం పద

ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి. దీనికి ‘ఫ్యామిలీ స్టార్’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగియడంతో, వచ్చే వారం నుంచే షూటింగ్ మొదలుపెట్టాలని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అంతేకాదండోయ్.. యూఎస్ఏలోనూ ఈ సినిమా చిత్రీకరణ కొనసాగనుంది. అందుకే, అక్కడ లొకేషన్లు జల్లెడ పట్టేందుకు పరశురామ్ తన టీమ్‌ని వేసుకొని అక్కడికి వెళ్లాడు. నిర్మాత దిల్‌రాజు కూడా వీరితో పాటు యూఎస్ఏ వెళ్లాడు. ఇప్పుడు అక్కడ లొకేషన్ స్కౌటింగ్ పూర్తైన సందర్భంగా.. చిత్రబృందం తాజాగా అందుకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ, ఒక ఫోటో కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలో దిల్‌రాజు, పరశురామ్‌లతో పాటు ఇతర టీమ్ సభ్యుల్ని మనం చూడొచ్చు. ఇండియాలో లోకల్ సీన్లన్నీ ముగించుకున్న తర్వాత.. ఫారిన్ షెడ్యూల్‌ని ప్రారంభించనున్నారని సమాచారం. అంటే, ఇకపై ఏకధాటిగా షూటింగ్ చేసుకుంటూపోవడమే!

Manoj Muntashir: నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి.. ఆదిపురుష్ రైటర్

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృనాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. సీతారామమ్‌లో ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయకుండా, చాలా చక్కగా నటించడంతో.. తమ సినిమాలోని పాత్రకు చక్కగా సరిపోతుందని భావించి, ఈమెని సెలెక్ట్ చేశారు. రొమాంటిక్ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయిన గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ సినిమాటోగ్రటీ బాధ్యతలు చేపడుతున్నాడు. గీత గోవిందం మేనియాని తిరిగి రిపీట్ చేసేలా.. పరశురామ్, విజయ్ స్క్రిప్టుపై బాగానే కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. మరి, ఆ మ్యాజిక్‌ని ఈ కాంబో రిపీట్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Exit mobile version