Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు సినిమాలు పవన్ చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ ను పూర్తిచేస్తున్న పవన్ ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ను మొదలుపెట్టనున్నాడు.. దీంతో పాటు వినోదాయ సీతాం ను కూడా మొదలు పెట్టనున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వీటితో పాటే సుజిత్ సినిమాను కూడా పవన్ పట్టాలెక్కించనున్నాడట. సాహో సినిమా తరువాత సుజిత్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకున్నది అనేది పక్కనపెడితే.. ఆ క్రేజ్ తోనే పవన్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. గతేడాది ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసి భారీ అంచనాలను పెట్టుకొనేలా చేసాడు. గ్యాంగ్ స్టర్ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. ఇక ఈ చిత్రాన్ని జనవరి 30న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది.
Read Also: NABARD Chairman: వ్యవసాయంతో పాటు మత్స్య, సహకార రంగాలకు రుణాలు
ఇవన్నీ పక్కన పెడితే.. ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ అభిమానులను భయాందోళనలకు గురిచేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో పాటలు కానీ, ఫైట్స్ కానీ ఉండవట. అసలు సినిమాకు వెళ్ళేదే పవన్ ఫైట్స్ కోసం.. సాంగ్స్ కోసం.. అలాంటింది పాటలు, ఫైట్స్ లేకపోవడం ఏంటి.. సుజీత్.. పవన్ తో ఎలాంటి సినిమా తీస్తున్నావ్ భయ్యా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా పక్కా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలోనే ఉండనుంది కానీ, పాటలు, ఫైట్లు లేకుండా కథ మీదనే బోర్ కొట్టనివ్వకుండా సుజిత్ నడిపించేలా ప్లాన్ చేస్తున్నాడట. రెండున్నర గంటల సినిమాలో కొద్దిగా కూడా ఎంటర్ టైన్మెంట్ లేకపోతే ప్రేక్షకులు ఆ సినిమాను ఎలా చూస్తారు..? కనీసం బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ కూడా ఉండవా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి పవన్ ఇలాంటి సినిమా తీస్తే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Read Also: Pawan Kalyan: పవన్ అలాంటి సినిమా తీస్తే అభిమానులకు నచ్చుతుందా..?