Bheemla Nayak : ప్రీరిలీజ్ ఈవెంట్ కు భారీ ప్లాన్… గెస్టులపై క్రేజీ రూమర్

Bheemla-Nayak

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒకవైపు సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే, మరోవైపు సినిమాకు సంబంధించిన పలు రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్‌కు హాజరు కాబోతున్న ముఖ్య అతిథులకు సంబంధించిన క్రేజీ రూమర్స్ సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి.

Read Also : Project K : ‘బాహుబలి’తో అమితాబ్ ఫస్ట్ డే, ఫస్ట్ షాట్… ఇద్దరూ ఇద్దరే !

ఈ వేడుకకు మహేష్ బాబు, బాలకృష్ణ, రాజమౌళి ముఖ్య అతిధులుగా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు అసలు ‘భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధులంటూ ఎవరూ లేరని వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మరో 2 రోజుల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి వేడుకకు గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు ? వంటి వివరాలను ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. “భీమ్లా నాయక్” ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోంది.