NTV Telugu Site icon

Ponniyin Selvan : మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ కు క్రేజీ డీల్

Ponniyin Selvan

Ponniyin Selvan

తెలుగు చిత్ర పరిశ్రమ బాహుబలి, పుష్ప, RRR వంటి పాన్-ఇండియా హిట్‌లను సాధించింది. KGFతో కన్నడ చిత్ర పరిశ్రమ కూడా పాన్-ఇండియా హిట్ సాధించింది. దేశంలోని అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమలలో తమిళ సినిమా కూడా ఒకటి. అయితే ఈ ఇండస్ట్రీ నుంచి ఇప్పటిదాకా ఒక్క పాన్-ఇండియా హిట్ కూడా రాకపోవడంతో, విజయాన్ని అందుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ “పొన్నియిన్‌ సెల్వన్‌” ఆ ఫీట్ సాధిస్తుందా ? అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు భాగాల సాగా “పొన్నియిన్‌ సెల్వన్‌” అనే నవల ఆధారంగా రూపొందింది. “పొన్నియిన్ సెల్వన్” మొదటి భాగం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also : Mahesh Babu : ప్యారిస్‌ ట్రిప్… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఆల్బమ్

ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. సమాచారం ప్రకారం స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో “పొన్నియన్ సెల్వన్” మూవీ రెండు భాగాల డిజిటల్ హక్కులను రూ. రూ. 125 కోట్లకు కొనుగోలు చేసింది. మరి మణిరత్నం ఈ సినిమాతో అందరూ ఆశిస్తున్న హిట్ ను అందుకుంటాడా ? అనేది చూడాలి. “పొన్నియిన్ సెల్వన్” చిత్రంలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.