Band Melam : కోర్టు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో నటించిన హర్ష్ రోషన్, శ్రీదేవిలకు మంచి పేరొచ్చింది. ఫోక్సో కేసు చుట్టూ తిరిగిన ఈ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ జంట మరో కొత్త సినిమాను ప్రకటించింది. బ్యాండ్ మేళం అనే సినిమాలో వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా చేస్తున్నారు. సతీశ్ జవ్వాజి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో వీరిద్దరి మధ్య వచ్చే సీన్లను ప్రజెంట్ చేశారు.
Read Also : Suman Shetty : ఆ డైరెక్టర్ మాట వల్ల కోటీశ్వరుడు అయిన సుమన్ శెట్టి..
హీరో రోషన్ ఇళ్లంతా వెతుకుతాడు. రాజమ్మ, రాజమ్మ అంటూ మేడమీదకు వస్తే అక్కడ శ్రీదేవి ఉంటుంది. రాజమ్మ ఈడున్నవా.. నీ కోసం ఇళ్లంతా దేవలాడుతున్నా అంటాడు. రాజమ్మ ఎవతిరా.. గునపం వేసి గుద్దుతా… బావ బాడుకావ్ అంటూ శ్రీదేవి ఫైర్ అవుతుంది. అట్లనకే నా గుండెకు ఏమన్నా అయితది అంటూ రోషన్ ఎమోషనల్ అవుతాడు. సరే జెప్పు ఏంది ముచ్చట అని శ్రీదేవి అనగానే.. నీ కోసం కొత్త ట్యూన్ కట్టానంటాడు మన హీరో. సరే వినిపియ్ అనగానే.. ఈ యాదగిరి వాయిస్తే బోనగిరి దాకా వినిపియ్యాలే అంటూ మంచి బీజీఎం వినిపిస్తాయి. అక్కడితో టైటిల్ గ్లింప్స్ ఎండ్ అవుతుంది. చూస్తుంటే మంచి ఫీల్ గుడ్ ఉన్న తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సినిమా తీస్తున్నట్టు కనిపిస్తోంది. పైగా ఇందులో శ్రీదేవి తెలంగాణలో వాడే సాదా సీదా బూతు పదాలను మాట్లాడటం ఆకట్టుకుంటోంది. ఈ జంట మరోసారి మాయ చేస్తుందా లేదా చూడాలి.
Read Also : Ravali : ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తు పట్టారా.. ఇలా మారిందేంటి..?