Site icon NTV Telugu

The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమాకు టాక్స్ రద్దు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

Kerala Story

Kerala Story

The Kerala Story: వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది ‘ది కేరళ స్టోరీ’ సినిమా. ఇప్పటికే ఈ సినిమాపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ సినిమా విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని పలువురు సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ..కోర్టులు అందుకు నిరాకరించాయి. దీంతో శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద భద్రతను కల్పించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రకటించింది.

‘ది కేరళ స్టోరి’ సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రటిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు ప్రకటించారు. అంతకుముందు శుక్రవారం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ, ఈ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద కుట్రలను బయటకు తీసుకువచ్చినందుకు కాంగ్రెస్, సీపీఎం పార్టీలు ఈ సినిమాపై దాడి చేస్తున్నాయంటూ విమర్శించారు.

Read Also: Viral : భారీ శ్వేత నాగు.. ఆశ్చర్యపోయిన స్థానికులు.. వీడియో వైరల్

మధ్యప్రదేశ్ లో మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేశా, ఈ సినిమా అవగాహన కల్పిస్తుందనరి అందరు తల్లిదండ్రులు, పిల్లలు ఈ సినిమాను చూాడాలని, అందుకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం టాక్స్ ఫ్రీ ప్రకటించిందని సీఎం శివరాజ్ సింగ్ అన్నారు. ‘లవ్ జీహాద్’, ఉగ్రవాదం, మతమార్పిడుల కుట్రల్ని ఈ సినిమా బయటకు తెస్తోందని ఆయన అన్నారు. క్షణికావేశంలో లవ్ జీహాద్ వలలో చిక్కుకుని యువతులు తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటారో ఈ సినిమా చూపిస్తుందని, ఉగ్రవాద కుట్రల్ని బహిర్గతం చేస్తుందని ఆయన అన్నారు. ‘లవ్ జీహాద్’ అనేది ముస్లిం యువకులు, హిందూ యువతులను ట్రాప్ చేసేందుకు చేస్తున్న ఓ కుట్రగా హిందూ అతివాద సంస్థలు ఆరోపిస్తున్నాయి.

కేరళ ఎంతో అందమైన రాష్ట్రం, ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు, ఇలాంటి రాష్ట్రంలో ఉగ్రవాద కుట్రలను కేరళ స్టోరీ బయటకు తెతస్తుందని బళ్లారిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ అన్నారు. దేశాన్ని నాశనం చేయాలనే ఉగ్రవాద ధోరణితో కాంగ్రెస్ ఈ సినిమాను వ్యతిరేకిస్తుందని, కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మోడీ సూచించారు. అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్ ఈ సినిమాను ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారంగా అభివర్ణించారు.

Exit mobile version