ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి బికినీ ఫోటోలు.. వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ఇండస్ట్రీకి, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. నటించేవారు పరిపాలించలేరు అనే ధోరణిని చాలామంది నటీనటులు తుడిచేశారు. ప్రస్తుతం ఎంతోమంది రాజకీయనాయకులు నటులుగా గుర్తింపు తెచ్చుకున్నవారే. ఇక ఇందులో హీరోయిన్లు కూడా ఉన్నారు. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోకసభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నుస్రన్ జహాన్, మీమీ చక్రవర్తి లాంటి వారు టీఎంసీ పార్టీ నుంచి ఎంపీలుగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇక వీరి బాటలోనే మరో మోడల్ ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన అర్చనా గౌతమ్ అనే మోడల్ ను హస్తినాపుర్ అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
ఫిబ్రవరిలో జరగబోయే ఈ ఎన్నికల కోసం ఆమె ప్రచారంలో పాల్గొంటుంది. గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చిన ఈమె ఎవరు అని ప్రజలు గూగుల్ ని అడగగా ఆమె గత జీవితం మొత్తం బయటికి వచ్చింది. 2018లో మిస్ ఇండియా బికినీగా గెలిచిన అర్చనా గౌతమ్, 2018లో మిస్ కాస్మో వరల్డ్ గానూ, 2014లో మిస్ ఉత్తరప్రదేశ్ గానూ నిలిచింది. ఇక ఈ ప్రచారంలో అర్చన బికినీ ఫోటోలను షేర్ చేస్తూ.. ఇలాంటివారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీటిపై అర్చన స్పందిస్తూ ” నా బికినీ ఫోటోలు చూసి ఓటు వేయొద్దు.. నేను ఎందుకు రాజకీయాలలోకి వస్తునాన్నో తెలుసుకొని ఓటు వేయండి. నా సొంత ఊరిలో రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి విని, వారికి ఏదోఒకటి చేయాలనే పట్టుదలతో నేను ఇందులోకి వచ్చాను.. ప్రజలు తన ఇష్టాన్ని గౌరవించి వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాలకు ముడిపెట్టకుండా నాకు ఓటు వేయాలని కోరుతున్నాను అని చెప్పుకొచ్చింది.
Also Read
- Ravi Teja : నాకు ఆ హీరోయినే కావాలంటున్నరవితేజ.. మాకొద్దంటున్న ఫ్యాన్స్
- Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
తాజావార్తలు
-
Ravi Teja : నాకు ఆ హీరోయినే కావాలంటున్నరవితేజ.. మాకొద్దంటున్న ఫ్యాన్స్
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు స్టార్ ప్లేయర్ డౌటే!
-
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
-
Dharmendra Pradhan: నీట్‌పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!