35 ఏళ్లుగా మా కుటుంబాల మధ్య పోటీ : ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జక్కన్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు మేకర్స్ ప్రమోషన్స్ దూకుడుగా చేస్తున్నారు. ‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ తరువాత రాజమౌళి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రంలో ఎవరి పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయమై చర్చ నడుస్తోంది. సినిమా ప్రమోషన్స్ సమయంలో ఎన్టీఆర్ మల్టీస్టారర్ ట్రెండ్ గురించి ఓపెన్ అయ్యాడు.
ఎన్టీఆర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు మల్టీస్టారర్‌లో నటించలేదు. మొదటిసారి రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్న తారక్ ఈ సినిమా గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఈ సమయంలో ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ ఊపందుకుంటుందా? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ సానుకూలంగా స్పందించారు. తారక్… రామ్ చరణ్‌తో తన ఈక్వేషన్ గురించి చెప్పుకొచ్చాడు. “నాకు ఆ విషయం గురించి అంతగా తెలియదు. కానీ గత 35 సంవత్సరాలుగా మా కుటుంబాల మధ్య పోటీ ఉంది. నేను, రామ్ చరణ్ చాలా మంచి స్నేహితులం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తర్వాత, పరిశ్రమలోని స్టార్స్ భవిష్యత్తులో మరిన్ని మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లు చేయడానికి ముందుకు వస్తారు” అని అన్నారు. కాగా ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు