Martin Luther King: యోగిబాబు పాత్రలో సంపూ.. ‘సత్య’కి ఇచ్చి ఉంటే వేరే లెవల్ అంతే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Comedian Satya will be Perfect for Martin Luther King: తమిళంలో యోగిబాబు హీరోగా తెరకెక్కిన మండేలా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కోసం ఇండియా షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది కానీ ఎందుకో తుది నామినేషన్స్ లో ఆ సినిమాకు చోటు దక్కలేదు. మండేలా సినిమా రెండు నేషనల్ అవార్డ్స్‌ను కూడా గెలుచుకోగా ఇక అదే సినిమాను తెలుగులో మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంగళవారం నాడు విడుదల చేసారు. ఈ పోస్టర్ లో సంపూర్ణేష్‌బాబు తల పై కిరీటం ఉండటం, అందులో కొంత మంది నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టు డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్‌బాబుతో పాటు డైరెక్టర్ వెంకటేష్ మహా, ఎలిబీ శ్రీరామ్, నరేష్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
RAM: దేశభక్తి చిత్రంగా రాపిడ్ యాక్షన్ మిషన్.. ఆసక్తిరేపుతున్న ఫస్ట్ లుక్
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఈ సినిమాను అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించగా ఈ సినిమా పంచాయతీ ఎలక్షన్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి సంపూర్ణేష్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి కామెడీ సినిమాల తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన తెలుగులో చాలా సినిమాలే చేసినా విజయాల్ని మాత్రం ఎందుకో అందుకోలేకపోయాడు. ఇప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కూడా కనిపిస్తున్న సంపూ కంటే ఈ పాత్రకు కమెడియన్ సత్యను తీసుకుని ఉంటే వేరే లెవల్లో ఉండేదని అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఒకరకంగా యోగిబాబు, సత్య బాడీ లాంగ్వేజ్ కొంచెం దగ్గరగానే ఉంటుంది. అలాగే ఇద్దరివీ చూడగానే నవ్వు తెప్పించే ముఖాలు. సంపూ కూడా మంచి నటుడే కానీ ఈ పాత్రకు కనుక సత్యని తీసుకుని ఉంటే వేరే లెవల్లో ఉండేదని అంటున్నారు.
తాజావార్తలు
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?