NTV Telugu Site icon

Comedian Satya: ‘రంగబలి’ కోసం ‘సత్యబలి’.. వాళ్లలో ఎవరినీ వదల లేదుగా!

Satya Interview With Naga S

Satya Interview With Naga S

Comedian Satya Rangabali Interview: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతమున్న ప్రతిభావంతులైన హాస్యనటుల్లో సత్య ఒకరు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సత్య టైమింగ్, ఆయన డైలాగ్ డెలివరీ ఒకప్పటి కమెడియన్స్ ను గుర్తు చేయకుండా చాలా యూనిక్ అనిపిస్తూ ఉంటుంది. అయితే సత్య తాజాగా నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘రంగబలి’ సినిమాలో నటించారు. ఈ సినిమా వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న క్రమంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టింది. ఇప్పటికే హీరో నాగశౌర్య ప్రెస్ మీట్ నిర్వహించగా మీడియా సంస్థలకు వరుసగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అయితే, చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఒక సంచలన ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో నాగశౌర్య, సత్య ఇద్దరే కనిపిస్తూ ఉండగా నాగశౌర్యను సత్య ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే ఇక్కడ సత్య ఒక నటుడిగా శౌర్యను ఇంటర్వ్యూ చేయడం లేదు, ఈ ఇంటర్వ్యూలో ప్రత్యేక ఏమిటంటే.. తమ ఇంటర్వ్యూలు, షోలు, ప్రెస్ మీట్ల ద్వారా పాపులర్ అయిన ఐదుగురు తెలుగు పాపులర్ జర్నలిస్టులను సత్య ఇమేట్ చేయడమే.

Sai Chand Death: సాయిచంద్ మృతదేహానికి కేసీఆర్ నివాళి.. కన్నీళ్లను ఆపుకుంటూ?

ఆ ఐదుగురు ఎవరంటే ఒక మీడియా సంస్థ అధినేత రాధాకృష్ణ, ఒక వెబ్ పోర్టల్ జర్నలిస్ట్ మూర్తి, సీనియర్ జర్నలిస్ట్- బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ జాఫర్, ‘సంతోషం’ సురేష్ కొండేటి, న్యూస్ ప్రెజెంటర్ దేవీ నాగవల్లిలను ఈ ఇంటర్వ్యూలో సత్య ఇమిటేట్ చేస్తూ కనిపించారు. ఈ ప్రోమోను విడుదల చేయగా అది యితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రంగబలి’ సినిమా ద్వారా పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్ కాగా ‘దసరా’ ఫేమ్ షైన్ టామ్ చాకో విలన్ గా నటిస్తున్నాడు.. సత్య, సప్తగిరి, బ్రహ్మాజీ, మురళీ శర్మ, గోపరాజు రమణ, భద్రం, నోయల్, అనంత శ్రీరామ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు పవన్ సిహెచ్ సంగీతం సమకూర్చారు.

Show comments