Rangabali spoof Interview part2: నాగశౌర్య చేసిన తాజా సినిమా రంగ బలిని వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా పవన్ బాసంశెట్టి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కమెడియన్ సత్య, శుభలేఖ సుధాకర్, సప్తగిరి, నోయల్, బ్రహ్మశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా మీద ఆసక్తి పెంచగా ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లేందుకు ఉన్న అన్ని మార్గాలను వాడుకుంటోంది సినిమా యూనిట్. ఈ సినిమా జూలై 7వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానున్న క్రమంలో ప్రమోషన్లో భాగంగా ‘రంగబలి’ యూనిట్ ఓ స్పూఫ్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో పాపులర్ తెలుగు జర్నలిస్టులను ఇమిటేట్ చేస్తూ కమెడియన్ సత్య ప్రోమో విడుదలైన వెంటనే కలకలం రేగింది.
Samajavaragamana : సామనవరగమనపై బన్నీ ప్రశంసల జల్లు
మొత్తం 5 మంది పాపులర్ జర్నలిస్టులను సత్యని ఇమిటేట్ చేసినట్టు.. ఓ ప్రోమోని కూడా విడుదల చేయగా అది చూసి.. ఇద్దరు జర్నలిస్ట్ లు బాగా హర్ట్ అయ్యారని.. అందువల్ల ఆ ఇంటర్వ్యూ రిలీజ్ చేయడం లేదు అంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరిగినా నిన్న ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఫస్ట్ పార్ట్ అంటూ ఓ వీడియోను విడుదల చేసింది ‘రంగబలి’ యూనిట్. ఇక అందులో ఇద్దరిని ఇమిటేట్ చేయగా ఈరోజు రిలీజ్ చేసిన రెండో పార్ట్ లో మరో ముగ్గురు జర్నలిస్టులను కూడా టార్గెట్ చేసింది సినిమా టీమ్. అయితే ఎప్పటిలానే ఈ వీడియో స్టార్టింగ్ లోనే ‘ జర్నలిస్ట్ ల పై ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని, కేవలం తమ సినిమా ప్రమోషన్ కోసం తప్ప.. వారిని కించపరచడానికి ఇలాంటి వీడియో చేయలేదని’ ఒక డిస్క్లైమర్ కూడా వేశారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి మరి.