Colors Swathi Response On Divorce Rumors: ఒకప్పటి టీవీ హోస్ట్, తరువాతి కాలంలో టాలీవుడ్ హీరోయిన్గా మారిన స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి కొంత కాలం క్రితమే వికాస్ అనే పైలట్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నిజానికి ఆమె పెళ్లి అయినప్పటి నుండి సినిమాల్లో యాక్టివ్‌గా లేదు. ఆమె గత ఏడాది ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచినప్పటికీ, నటి ఈమధ్య కాలంలో మరో విషయంలో వార్తల్లోకి వచ్చింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్లో చేసిన కొన్ని మార్పులు ఆమె గురించిన అనేక వార్తలకు ఆజ్యం పోసినట్టు అయింది. గత వారంలో, స్వాతి తన పెళ్లి ఫొటోలు, తన భర్త వికాస్ వాసుతో పోజులిచ్చిన ఇతర ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో కనపడకుండా చేసింది. దీంతో ఆమె డిలీట్ చేసిందని కొందరు లేదు ఆర్కీవ్ లో పెట్టిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. దీంతో ఆమె విడాకులు తీసుకోబోతోంది ని అంటూ వార్తలు తెర మీదకు వచ్చాయి.
Nani: ఇకపై నాని అలాంటి సినిమాలు చేయడా?
ఎందుకంటే విడాకుల వార్తలను అధికారికంగా ప్రకటించకముందే సమంత, నిహారిక కొణిదెల వంటి వారు సోషల్ మీడియాలో ఇలా తమ భాగస్వాములతో దిగిన ఫోటోలను, వారి గురుతులు ఉన్న ఫొటోలను తొలగించిన క్రమంలో స్వాతి కూడా విడాకులకు సిద్ధం అయిందంటూ ప్రచారం జరుగుతోంది. కమర్షియల్ పైలట్‌గా పనిచేస్తున్న మలయాళీ వికాస్ వాసును స్వాతి 2018లో ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక ఈ విడాకుల వార్తల నేపథ్యంలో ఒక ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయం మీద స్పందించమని ఆమెను అడిగితే “నేను చెప్పడానికి ఏమీ లేదు, ఏదైనా చెప్పాల్సిన విషయం ఉంటే నేనే చెప్తాను అని ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి 2020లో, ఇలాంటి విడాకుల పుకార్లు వచ్చినప్పుడు, నటి తన వ్యక్తిగత జీవితం పబ్లిక్ అవ్వొద్దు అని కొన్ని పోస్ట్‌లను దాచిపెట్టానని (ఆర్కైవ్) ఆమె పేర్కొంది. అయితే ఇప్పుడు ఆమె అవేమీ చెప్పకుండా ఏదైనా చెప్పాల్సిన విషయం ఉంటే నేనే చెప్తాను అని అనడంతో విడాకుల గురించి ఆమె త్వరలో చెప్పే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.