Site icon NTV Telugu

RRR: ‘ఆర్ఆర్ఆర్’ తొలి సంచలన రివ్యూ.. 3 వేల కోట్లు పక్కా అంట..

rrr

rrr

సినీ అభిమానులందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సమయం రానుంది. ఎన్నో ఏళ్లుగా ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఎదురుచూపులు తెరపడింది. ఎన్నో వాయిదాల తరువాత ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకతవంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించిన సంగతి తెల్సిందే. ఇక తాజాగా ఈ సినిమా చూసిన టెక్నీషియన్స్ చెప్తున్న రివ్యూ ప్రేక్షకులను షాకింగ్ గురిచేస్తున్నాయి.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు కలరిస్ట్‌గా పని చేసిన శివకుమార్ బీవీఆర్ తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా కలెక్షన్స్ గురించి చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి డీఐ, కలరిస్ట్ శివకుమార్ మాట్లాడుతూ ” ఇప్పుడే ఆర్ఆర్ఆర్ చూశా. కలరిస్ట్‌గా ఒక్కో ఫ్రేమ్ వెయ్యిసార్లు చూశాను. సాధారణ ప్రేక్షకుడిగా లాస్ట్ కాపీ చూసినప్పుడు ఎమోషనల్ అయ్యాను. ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ రికార్డును బ్రేక్ చేస్తుంది. 3000 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. కీరవాణి బీజీఎం కూడా సినిమాకు చాలా హైలైట్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇతగాడి రివ్యూ నెట్టింట వైరల్ గా మారింది. 3000 కోట్లు వసూలు చేస్తుంది అనడం కొద్దిగా ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version