Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cocktail 2 Trailer : ప్రేమ కథలు రకరకాలగా వస్తుంటాయి. అయితే వీటిలో ట్రయాంగిల్ కథలు ఆడియన్స్ ను మరింత ఎంటర్టైన్ చేస్తాయి. ప్రేమ, ఫ్రెండ్ షిప్, రమాంటిక్ థీమ్స్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది బాలీవుడ్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ‘కాక్టెయిల్’కు సీక్వెల్‌గా రూపొందిన ‘కాక్టెయిల్ 2’. తాజాగా విడుదలైన ట్రైలర్ ని చూస్తుంటే మాత్రం యూత్ కేరింతలు పెడుతున్నారు. 2012లో విడుదలైన ‘కాక్టెయిల్’ బాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఆ సినిమా విడుదలై దాదాపు 14 ఏళ్లు గడిచినా కూడా ఇంకా ప్రేక్షకుల మదిలో ఏమాత్రం చెక్కుచెదరలేదు. దర్శకుడు హోమీ అడజానియా ఈసారి షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్నల క్రేజీ కాంబినేషన్‌తో కథను మరింత కొత్త కోణంలో చూపించబోతున్నారు.
నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ ప్రారంభంలోనే షాహిద్ కపూర్ రిలేషన్షిప్స్ గురించి చెప్పే మాటలు ప్రేక్షకులను వెంటనే కథలోకి లాక్కెళ్తాయి. అతని మాటలకు కృతి సనన్ సరదాగా స్పందించే తీరు ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత కథ అందమైన ఇటలీ లొకేషన్లకు మారుతుంది. అక్కడ ముగ్గురు కలిసి గడిపే ఆనంద క్షణాలు, స్నేహంగా మొదలైన వీళ్ళ రిలేషన్ క్రమంగా ప్రేమగా మారడం వంటి అంశాలు కథలో కీలకంగా కనిపిస్తున్నాయి. షాహిద్ కపూర్, రష్మిక మందన్న మధ్య నడిచే రొమాంటిక్ ట్రాక్ ఒకవైపు సాగుతుండగా, షాహిద్‌కు సన్నిహితురాలైన కృతి సనన్ అతనిపై ప్రేమను పెంచుకోవడం కథను ఆసక్తికరంగా మారుస్తోంది. ఈ ముగ్గురి మధ్య జరిగే ఈ వ్యవహారం చివరకు ఎలాంటి ముగింపుకు దారి తీస్తుందనేది సినిమాకు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది.
Also Read
- Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
- Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
- Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు... బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
ఈ ట్రైలర్లో మరో విశేషం ఒరిజినల్ ‘కాక్టెయిల్’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘తుమ్ హీ హో బంధు’ని బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించడం. ఈ నోస్టాల్జిక్ టచ్ పాత సినిమాను చూసిన ప్రేక్షకుల్లో ఉత్సాహం మళ్లీ తట్టిలేపుతోంది. సోషల్ మీడియాలో కూడా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. షాహిద్ కపూర్ మళ్లీ తన రొమాంటిక్ అవతార్‌లో కనిపించడం, కృతి సనన్, రష్మిక మందన్నల స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ట్రైలర్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
ప్రస్తుతం బాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతున్న సమయంలో ‘కాక్టెయిల్ 2’పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఒకప్పుడు దీపికా పదుకొనే కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘కాక్టెయిల్’ తరహాలోనే ఈ సినిమా కూడా రష్మిక మందన్న బాలీవుడ్ ప్రయాణానికి కీలక మలుపు కావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దినేష్ విజన్, లవ్ రంజన్ వంటి ప్రముఖ నిర్మాతలు నిర్మించిన ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.
- Tags
- cinema
తాజావార్తలు
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
-
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్‌కు బీసీసీఐ అల్టిమేటం!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!