భారతరత్న, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తమ పాటలతో సినీ సంగీత రంగంపై చెరగని ముద్రవేసిన లతాజీ మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని అన్నారు.
Read Also : లతాజీ ఇంటి పేరు వెనుక ఉన్న కథ
“సప్త స్వరాల తరంగ నాదాలతో శ్రోతలను తన్మయత్వంలో ఓలలాడించిన లతాజీ ఉత్తర దక్షిణ భారత సంగీత సరిగమల వారధి. హిందుస్తానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ వద్ద నేర్చుకున్న లతాజీ ఉర్దూ కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేసి గజల్ గమకాలను శ్రావ్యంగా ఒలికించేది. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే, దేశ విదేశాల వ్యాప్తంగా ఆమెకు అందిన లెక్క లేనన్ని పురస్కారాలకు లతాజీ వల్ల గౌరవం దక్కింది. ఎందరో గాయకులు రావచ్చు కాని లతాజీ లేని లోటు పూరించలేనిది. లతాజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి” అంటూ సీఎం కేసిఆర్ లతాజీ మరణానికి సంతాపం తెలియజేశారు.