Site icon NTV Telugu

Ravi Teja : క్లైమాక్స్ ఫైట్ చేస్తున్న ‘రావణాసుర’

Ravanasura

Ravanasura

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ సుధీర్ వర్మ కలయికలో రాబోతున్న చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ పిక్చర్స్ రవితేజ టీమ్‌వర్క్స్‌ పతాకంపై యాక్షన్ థ్రిల్లర్‌గా అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ ఇందులో హీరోయిన్లు.

ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రొడక్షన్ డిజైనర్ డి.ఆర్.కె కిరణ్ పర్యవేక్షణలో నిర్మించిన 5 కోట్ల విలువైన భారీ సెట్‌లో క్లైమాక్స్ లో వచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫైట్
మాస్టర్ స్టన్ శివ యాక్షన్ బ్లాక్‌ని స్టైలిష్ గా జైన్ చేసి తీస్తున్నట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఇందులో రవితేజ లాయర్‌గా కనిపించనున్నాడు. శ్రీకాంత్ విస్సా అందించిన కథ ఇదని, హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్నారని, విజయ్ కార్తీక్క న్నన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నాడని చెబుతున్నారు.

Exit mobile version