Villains : టాలీవుడ్ లో ట్రెండ్ మారుతోంది. ఒకప్పటి క్లాస్ హీరోలు రూట్ ఛేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్ విలన్లుగా అవతారం ఎత్తుతున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాలు చేసిన హీరోలు.. ఇప్పుడు అత్యంత వైలెన్స్ ఉండే పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఒకప్పటి క్లాస్ హీరోలకు ఇప్పుడు మార్కెట్ లేదు. వారి గ్రాఫ్ ఎన్నడో పడిపోయింది. అయితేనేం.. హీరోలుగా చేస్తే ఎంత సంపాదిస్తారో.. ఇప్పుడు విలన్లుగా చేస్తూ అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. హీరోలతో సమానమైన విలన్ పాత్రలు చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అందులో చూస్తే.. జగపతి బాబు, శ్రీకాంత్, శివాజీ.. ఈ కోవలోకే వస్తారు. ఈ ముగ్గురూ ఒకప్పుడు ఫ్యామిలీ హీరోలు.
Read Also : Khushboo Patani : చిన్నారిని కాపాడిన హీరోయిన్ చెల్లెలు.. ప్రముఖుల ప్రశంసలు
వాళ్లు చేసే సినిమాలు కుటుంబంతో సహా చూసేవిగా ఉండేవి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలకు ఈ ముగ్గురూ కేరాఫ్ అడ్రస్. క్లాస్ హీరోలుగా వీరు పేరు తెచ్చుకున్నారు. వారి పాత్రలు అత్యంత సున్నితంగానే అనిపించేవి. కానీ ఇప్పుడు ఈ ముగ్గురూ భయపెట్టించే విలన్ పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే జగపతి బాబు విలన్ గా ఎక్కువ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత శ్రీకాంత్ కూడా ఇదే కోవలోకి వచ్చేశాడు. బలమైన విలన్ పాత్రలు చేస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. కొత్తగా శివాజీ కూడా మంగపతి పాత్రతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. దీంతో శివాజీ రూపంలో ఇండస్ట్రీకి కొత్త విలన్ దొరికేసినట్టు అయింది. వీరే కాకుండా మరింత మంది ఓల్డ్ హీరోలు కూడా ఇప్పుడు విలన్ పాత్రల్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారంట. ఇది మంచి పరిణామమే. ఎందుకంటే హీరో ఇమేజ్ ఉన్న వాళ్లు విలన్లుగా చేస్తే ఆ పాత్రలకు మంచి క్రేజ్ ఉంటుంది. సినిమా మార్కెట్ కూడా పెరుగుతుంది. ముందు ముందు ఇంకెవరు వస్తారో చూడాలి.
