Manchu Manoj: మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు.. సొంత అన్ననే..?
Manchu Manoj:మంచు మోహన్ బాబు గురించి కానీ, మంచు వారి వారసులు గురించి కానీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో వారి గురించి ఏదో ఒక టాపిక్ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఇక మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విబేధాలు నెలకొన్నాయని ఎన్నో రోజుల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మంచు మనోజ్, భూమా అఖిల ప్రియ సోదరి మౌనికను ప్రేమించడం, అది ఇష్టం లేని మోహన్ బాబు కుటుంబం పెళ్ళికి నిరాకరించడం.. దీంతో మనోజ్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడంటూ పుకార్లు షికార్లు చేసాయి. ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. గత కొన్నిరోజుల నుంచి మాత్రం మనోజ్, మంచు కుటుంబం చేసుకొనే ఏ ఫంక్షన్ లో కానీ, ఈవెంట్ లో కానీ కనిపించలేదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. వీరి మధ్య విబేధాలు ఉన్నాయి అన్నది నిజమేనని, అందుకు ఈ వీడియోనే సాక్ష్యమని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.
విషయం ఏంటంటే.. నిన్న మంచు విష్ణు బర్త్ డే. అన్నకు బర్త్ డే విషెస్ ను మనోజ్ కొంచెం ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక మహిళ జంబలకిడి జారు మిఠాయ అంటూ సాంగ్ పాడిన విషయం విదితమే. ఆ సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దాని మీద ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. చివరకు మనోజ్ సైతం ఆమెను కలిసి ఆమెతో అదే పాటను పాడించి విష్ణుకు బర్త్ డే విషెస్ చెప్పాడు. అన్న విష్ణు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యంగా పాజిటివ్ గా ఆలోచించాలని మరీ చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్స్ మంచు కుటుంబాన్ని మరోసారి ఆడేసుకుంటున్నారు. సొంత అన్ననే తమ్ముడు ట్రోల్ చేస్తున్నాడు.. మిగతా వారు చేయడంలో తప్పేముంది అంటూ చెప్పుకోస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక మరో విషయమేంటంటే.. ఈ వీడియోకు కానీ, తమ్ముడు కు కానీ విష్ణు స్పందించకపోవకడం.. తనకు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పిన విష్ణు, తమ్ముడు మనోజ్ ను మాత్రం పట్టించుకోకుండా వదిలేసాడని, ఇక్కడే వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పుకొస్తున్నారు.
Also Read
- Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
- Bollywood : బాలీవుడ్‌లో సత్తా చాటలేకపోతున్న సౌత్ స్టార్స్.. ఇక్కడ టాప్ పొజిషన్.. హిందీలో ఫ్లాపులు
- Vishwambhara : విశ్వంభర నుండి కీరవాణి ఔట్.. గౌరహరి ఇన్
- Christopher Nolan : క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ట్రైలర్ రిలీజ్.. ఆస్కార్ రేంజ్
తాజావార్తలు
-
Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
-
Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
-
Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
-
West Bengal: దిగిపోయిన దీదీ.. రాబోతున్న బీజేపీ! మే 9న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..
-
Bollywood : బాలీవుడ్‌లో సత్తా చాటలేకపోతున్న సౌత్ స్టార్స్.. ఇక్కడ టాప్ పొజిషన్.. హిందీలో ఫ్లాపులు
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!