Baahubali The Epic : ఇంకో ఐదు రోజుల్లో సంచలన సినిమా బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కాబోతోంది. రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. నేరుగా వచ్చే సినిమాకు ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో.. ఈ రీ రిలీజ్ కు కూడా అంతే క్రేజ్ ఏర్పడుతోంది. అందుకే ఈ సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు ఈ సినిమాకు కెమెరామెన్ గా పనిచేసిన సెంథిల్ కుమార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రెండు పార్టుల్లో చాలా సీన్లు తీసేసినట్టు తెలిపారు.
Read Also : Napoleon Returns : ‘నెపోలియన్’ రిటర్న్స్’ గ్లింప్స్ రిలీజ్..
రెండు పార్టులను కలిపి ఒకే పార్టు కిందకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. రెండు పార్టుల్లో చాలా సీన్లను తీసేశాం. కానీ ఎమోషన్ మిస్ కావొద్దని జాగ్రత్త పడ్డాం. ఇందుకోసం ఓ కొత్త సీన్ ను యాడ్ చేశాం. అది కొత్తగా షూట్ చేసింది కాదు.. అప్పుడు ఎడిటింగ్ లో తీసేసిందే. దాన్ని ఇప్పటి విజువల్ కు సరిపోయేలా ఎడిట్ చేసి తీసుకొస్తున్నాం. గతంలో ఎన్నడూ చూడని విధంగా బాహుబలి ది ఎపిక్ మూవీ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు సెంథిల్ కుమార్. ఆయన కామెంట్లతో అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి.
Read Also : Baahubali : శ్రీదేవి పాత్ర నాకు వచ్చిందని తెలియదు.. రమ్యకృష్ణ కామెంట్స్
