Site icon NTV Telugu

RC 15 : ప్రాజెక్ట్ నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్ ?

Ram Charan

Ram Charan

RRRతో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రామ్ చరణ్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ తో “RC 15” అనే మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా, ఇటీవల అమృత్‌సర్‌లో జరిగిన ఓ షెడ్యూల్‌ను చిత్ర బృందం తాజాగా పూర్తి చేసుకుంది. “ఆచార్య” ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ తిరిగి హైదరాబాద్ కు కూడా చేరుకున్నాడు. ఇప్పుడు విషయం ఏమిటంటే… “RC 15” నుంచి సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నారు అంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి.

Read Also : Sarkaru Vaari Paata Title Song : వెపన్స్ లేని వేట !

ఈ రూమర్స్ రావడానికి కారణం అమృత్‌సర్ షెడ్యూల్‌లో రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారట. కానీ నిజానికి ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ తిరు అని మేకర్స్ ఇంతకుముందు అధికారికంగా ప్రకటించారు. అయితే 4 షెడ్యూళ్ల తర్వాత వ్యక్తిగత సమస్యల కారణంగా తిరు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని అంటున్నారు. మరి తిరు నెక్స్ట్ షెడ్యూల్‌లో జాయిన్ అవుతాడా ? లేక రత్నవేలు కంటిన్యూ అవుతాడా ? అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Exit mobile version