Zareen Khan: బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఇటీవల ముంబైలో జరిగిన ఓ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా స్టోర్‌లోని దుస్తులను పరిశీలిస్తున్న జరీన్ ఖాన్‌ను ఓ ఫొటోగ్రాఫర్ “ఆ డ్రెస్సును ట్రై చేయొచ్చుగా” అని అడగటంతో ఆమె ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన జరీన్, “ఏంటి.. మీ ముందేనా? ఇలాంటి అర్థంలేని మాటలు నా ముందు మాట్లాడొద్దు. హద్దులో ఉండండి” అంటూ గట్టిగా హెచ్చరించారు. పబ్లీక్‌గా తనను అలా అడగడంతో, ఆమె ఆ పరిస్థితిని ఎంతో ధైర్యంగా, స్పష్టంగా ఎదుర్కొన్న తీరు ప్రశంసలు అందుకుంటోంది.
ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో జరీన్ ఖాన్‌కు భారీగా మద్దతు లభిస్తోంది. “ఆమె చెప్పింది పూర్తిగా సరైనదే”, “ఫోటోగ్రాఫర్స్ కూడా తమ హద్దులు తెలుసుకోవాలి”, “కెమెరా ముందు ఎవరైనా బట్టలు మార్చుకుంటారా?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అసౌకర్యంగా అనిపించిన సందర్భంలో గౌరవంగా కానీ గట్టిగా ఎలా స్పందించాలో జరీన్ ఖాన్ చూపించారని అభినందిస్తున్నారు. 2010లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘వీర్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జరీన్ ఖాన్, తర్వాత ‘హౌస్‌ఫుల్ 2’, ‘హేట్ స్టోరీ 3’, ‘అక్సర్ 2’, ‘1921’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. చివరిసారిగా 2021లో రిలీజ్ అయిన ‘హమ్ భీ అకేలే, తుమ్ భీ అకేలే’ చిత్రంలో కనిపించిన ఆమె ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ, ఈ ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచారు.
హద్దు దాటిన ఫొటోగ్రాఫర్‌కు హీరోయిన్ #ZareenKhan స్ట్రాంగ్ కౌంటర్! 🔥
ముంబైలో ఓ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా డ్రెస్సులు చూస్తున్న జరీన్ ఖాన్‌ను ఓ ఫొటోగ్రాఫర్ "ట్రయల్ వేయొచ్చుగా" అని అడగడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఏంటి.. మీ ముందేనా? ఇలాంటి ఫాల్తూ మాటలు నా ముందు మాట్లాడొద్దు.…
— Filmy Bowl (@FilmyBowl) July 14, 2026

