వన్స్ అపాన్ ఏ టైం యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై థ్రిల్లర్ కి ఫుల్ క్రేజ్, కానీ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ డామేజ్ చేస్తున్నాయి YRF యూనివర్స్ చిత్రాలు. టైగర్ 3 నుండి మెల్లిగా స్పై థ్రిల్లర్ యూనివర్స్ కి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. వార్టు అంచనాలను అందుకోలేకపోతే, ఆల్ఫా ఆడియన్స్ పేషన్స్ కి మరింత టెస్ట్ పెడుతోంది. ఈ మూడు సినిమాల రిజల్ట్ మిగిలిన ఫ్రాంచైసీ చిత్రాలపై ఎఫెక్ట్ ని చూపిస్తుందా?
ఒకప్పుడు యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై త్రిల్లర్ యూనివర్స్ నుంచి మూవీ వస్తోందంటే ఆడియెన్స్ లో ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు వస్తోందంటే మూవీ లవర్స్ భయ పడిపోతున్నారు, ఎందుకంటే సేమ్ రొటీన్ కోటు స్టోరీని వండి వార్చేస్తున్నారు మేకర్స్. ఆదిత్య చోప్రా పూర్తిగా స్టోరీలు వేలు పెడుతున్న దగ్గర నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. టైగర్ 3 నుండి స్పై థ్రిల్లర్ సిరీస్ చిత్రాలకు నానాటికి ఆదరణ తగ్గిపోతుంది. వార్ 2 అయిన యూనివర్స్ ని తిరిగి లేపుతుంది అనుకుంటే, మరింత ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. ఇద్దరు స్టార్స్ హృతిక్, NTRలను చేతిలో పెడితే, అయాన్ ముఖర్జీ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. వార్ టు ఆడియెన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేక పోయింది. అంతేకాదు, స్పై యూనివర్స్ కి ఎండ్ కార్డు పడే టైం దగ్గరపడిందన్న కామెంట్లు వినిపించాయి.
ఈసారి స్టోరీలో ఆదిత్య తమ్ముడు ఉదయ చోప్రా జోక్యం చేసుకున్నాడు, కానీ నో యూజ్. జూలై 3న రిలీజ్ చేసిన ఈ సినిమా, ఫుట్ ఫాల్స్ పెంచడంలో తడబడింది. ఆలియాభట్, సార్వరి వాగ్ నటించిన ఆల్ఫా, ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. సేమ్ పాత స్పై త్రిల్లర్ టెంప్లేట్ లోనే సినిమా సాగడంతో బోర్ కొట్టేసింది. ఇక రివ్యూ సంగతి చెప్పనక్కరలేదు. సీనియర్ బాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఆల్ఫా కి బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చారంటే, సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇదే ఫ్రాంచైజీ నుండి టైగర్ ఫోర్, పఠాన్ వర్సెస్ టైగర్ చిత్రాలను ఆపేస్తే బెటర్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి యశ్‌రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఈ మాటలను సీరియస్ గా తీసుకుంటాడో, లేక సిల్లీగా చూస్తాడో… వెయిట్ అండ్ సీ.”

