రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ అథేర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రీస్’. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల ఈ మూవీ టీజర్ ను ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగ రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంది. అలానే టాలివుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా విడుదల అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
Also Read : Taapsee Pannu : పెళ్లి తర్వాత కనిపించని తాప్సి పొన్ను.. ఇప్పుడేం చేస్తుంది
నలుగురు ఫ్రెండ్స్ వారి మధ్య చిన్న చిన్న గొడవలు సరదా పంచ్ లు. ఇలాంటి కథాంశాలతో వచ్చే సిసినిమాలు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎప్పుడు ఉంటారు. దర్శకులు చేయాల్సిదల్లా రైటింగ్ లో మ్యాజిక్ చూపించడమే. అలంటి నేపధ్యంలోనే మరొక దోస్త్ గ్యాంగ్ జిగ్రీస్ పేరుతో.వస్తున్నారు. ఒక వింటేజ్ మారుతీ 800 కారు, నలుగురు ఫ్రెండ్స్ గోవా వెళ్లేందుకు వారు ఎదుర్కున్న అవస్థలు వంటి కాన్సెప్ట్ తో అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా రాబోతోంది జిగ్రీస్. కాగా ఇప్పడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. యూత్ ఆడియెన్స్ టార్గెట్ గా వస్తున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. చైల్డ్‌హుడ్ ఫ్రెండ్షిప్, నాస్టాల్జియా, క్రేజీ అడ్వెంచర్స్, హిలేరియస్ రోడ్ ట్రిప్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఈశ్వరాదిత్య డీవోపీ, కమ్రాన్ మ్యూజిక్, చాణక్య రెడ్డి ఎడిటర్ గా పని చేస్తున్నారు.