NTV Telugu Site icon

Yellamma : హమ్మయ్య…బలగం వేణుకు హీరో దొరికేసినట్టే..?

Venu

Venu

హాస్య నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు వేణు. 2023 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అటు ప్రశంసలతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది బలగం. వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది దాటినా కూడా ఇప్పటికి మరో సినిమా మొదలెట్టలేదు వేణు. బలగం సినిమాను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే రెండవ సినిమా కూడా చేయాల్సి ఉంది.

Also Read : Release Clash : నితిన్ కు పోటిగా నాగ చైతన్య… చూస్కుందాం..!

రెండవ సినిమా కోసం చాలా కాలం కిందటే ఓ కథ రెడీ చేసుకున్నాడు వేణు. ఆ కథను అందరి చుట్టూ తిరుగుతుంది కానీ ఎక్కడ ఫైనల్ కావట్లేదు. ముందుగా ఈ కథను నేచురల్ స్టార్ నాని కి వినిపించారు. కానీ సెకండ్ హాఫ్ పట్ల నాని సంతృప్తి చెందలేదు సో అక్కడ ఒకే అవ్వలేదు. అటు నుండి మరొక యంగ్ హీరో తేజ సజ్జా వద్దకు వచ్చి చేరింది. ఇక్కడ దాదాపు ఒకే అని కూడా వార్తలు వచ్చాయి. కానీ అక్కడ కూడా కార్యరూపం దాల్చలేదు. ఇక ఫైనల్ గా యంగ్ హీరో నితిన్ దగ్గరకు వచ్చి చేరింది.  నితిన్ కూడా వేణు ఒక నేరేషన్ ఇచ్చాడని తెలుస్తోంది.  ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్, కానీ ఆల్మోస్ట్ నితిన్ ఒకే చెప్పాడని కొన్ని కరెక్షన్స్ చెప్పాడని సమాచారం. అన్ని కుదిరితే నితిన్ తోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని టాక్ నడుస్తోంది. ఈ కథకు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే యల్లమ్మ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసి ఉంచారు.

Show comments