Sanjjanaa Galrani: సీరియల్ నటిగా మారిన హీరోయిన్ సంజనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘స్టార్ మా’ మరో సరికొత్త సీరియల్‌తో ముందుకు వస్తోంది. ‘ఏ దేవి వరమో నీవు’ పేరుతో తెరకెక్కిన ఈ సరికొత్త సీరియల్ జూలై 6 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్, ఆల్వాల్‌లోని వీబీఆర్ గార్డెన్స్‌లో భారీ ఎత్తున గ్రాండ్ ప్రీమియర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ వేడుకకు ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్ ఫేమ్ బాలు, ఈ సీరియల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ప్రముఖ నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, హీరోయిన్ సంజనా గల్రానితో పాటు సోనియా, శ్రవణ్‌లు ఈ ఈవెంట్లో సందడి చేశారు. ఎక్స్‌ప్రెస్ హరి తనదైన శైలిలో ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించి అందరినీ అలరించారు.
ఈ ప్రీమియర్ లాంచ్ వేడుకకు భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల కోసం సీరియల్ మొదటి ఎపిసోడ్‌ను ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేశారు. ఈ సీరియల్ కథ విషయానికి వస్తే.. నమ్మిన ప్రేమికుడి చేతిలో మోసపోయిన గీతాంజలి అనే మహిళ ఒక ఆడపాపకు జన్మనిస్తుంది. అయితే ఆమె తండ్రి, అన్నయ్య ఆ పసిపాపను తమ వారసురాలిగా అంగీకరించడానికి నిరాకరించి, కఠినంగా వ్యవహరిస్తూ ఒక అనాథ ఆశ్రమంలో వదిలేస్తారు. అక్కడే ‘అంజలి’ అనే పేరుతో పెరిగి పెద్దదైన ఆ అమ్మాయి, విధి ఆడిన వింత నాటకంలో అనుకోని పరిస్థితుల మధ్య తిరిగి తన కన్నతల్లి చెంతకే చేరుకోవాల్సి వస్తుంది. మరి, కన్నకూతురు అంజలిని తల్లి గీతాంజలి గుర్తుపడుతుందా? తల్లి ప్రేమ కోసం తపించే ఆ చిన్నారికి అమ్మ ఆప్యాయత దక్కుతుందా? అనే ఆసక్తికరమైన ట్విస్టులతో ఈ కథ సాగనుంది.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!