Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్‌ పాన్-ఇండియా మూవీ?

Hanuma Reddy Yakkanti To Direct Yash

Hanuma Reddy Yakkanti To Direct Yash

Hanuma Reddy Yakkanti To Direct Yash: కన్నడ స్టార్ యష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. కేజీఎఫ్ సిరీస్‌తో ఒక్కసారిగా పాన్-ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లో రావణుడిగా నటిస్తున్నాడు. ఇటీవల వచ్చిన ‘టాక్సిక్’ నిరాశపర్చినా.. రాకీ భాయ్‌ స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకులు క్యూలో ఉన్నారు. ఈ జాబితాలో ఎవరూ ఊహించని పేరు కూడా ఉండడం విశేషం. అతడే టాలీవుడ్ కొత్త దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి.

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా హనుమ రెడ్డి పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇదే అతడికి మొదటి సినిమా. ఈ సినిమా రిలీజ్ కాకముందే.. హనుమ రెడ్డి తదుపరి సినిమాపై ఇండస్ట్రీలో కొత్త టాక్ మొదలైంది. కన్నడ స్టార్ యష్‌తో హనుమ రెడ్డి మూవీ చేయబోతున్నాడని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. యష్‌తో కొత్త దర్శకుడి కాంబినేషన్ అనగానే అభిమానుల దృష్టి ఒక్కసారిగా ఈ ప్రాజెక్టు వైపు మళ్లింది. ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతున్నప్పటికీ.. దీనిపై అటు యష్ నుంచి కానీ, ఇటు హనుమ రెడ్డి నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అధికారిక ప్రకటన వస్తే తప్ప.. ఈ వార్తల్లో ఎంత నిజమెంతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

డేవిడ్ రెడ్డి సినిమాతో హనుమ రెడ్డి టాలీవుడ్‌లో బలమైన ఇంపాక్ట్ చూపించడానికి సిద్ధమవుతున్నాడు. మొదటి సినిమాకే స్టార్లతో కలిసి పనిచేస్తున్నాడు. మంచు మనోజ్, సముద్రఖని, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ సినిమాలో ఉన్నారు. సంగీతం దర్శకుదిగా రవి బస్రూర్, సినిమాటోగ్రఫర్‌గా ఆచార్య వేణు, స్టంట్ మాస్టర్‌గా సుప్రీమ్ సుందర్ వంటి టాప్ టెక్నీషియన్లను వర్క్స్ చేస్తున్నారు. దాంతో డేవిడ్ రెడ్డిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డేవిడ్ రెడ్డి హిట్ అయి, యష్‌తో సినిమా చేస్తే.. హనుమ రెడ్డి ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం. చూడాలి మరి యష్‌తో హనుమ రెడ్డి సినిమా ఉంటుందో లేదో.