Yash: రాకింగ్ స్టార్ యష్‌తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash: పాన్ ఇండియా స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా, వాటి తర్వాత ఈ క్రేజీ పట్టాలెక్కే అవకాశం ఉందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘KGF’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘Toxic’, చిత్రంలో నటిస్తున్నారు. అలాగే నితేశ్ తివారి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘Ramayana’లో రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు, ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘Hanu-Man’ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో రిషబ్ శెట్టితో ఒక ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘Jai Hanuman’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటించనున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తన పూర్తి ఫోకస్‌ను ఈ చిత్రంపైనే దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ సినిమా కూడా భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా సమాచారం ప్రకారం.. యష్ – ప్రశాంత్ వర్మ తమ ప్రస్తుత కమిట్మెంట్లు పూర్తి చేసిన అనంతరం ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి గట్టిగా టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ఈ కాంబో నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఈ చిత్రం ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
తాజావార్తలు
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..