Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!

Yash

Yash

కన్నడ పాన్-ఇండియా స్టార్ ‘రాకింగ్’ యష్ తదుపరి సినిమాపై ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్, టాక్సిక్ లాంటి డిజాస్టర్ తర్వాత యష్ చేయబోయే ప్రాజెక్ట్‌లపై భారీ అంచనాలు ఉండటంతో, ఆయన ఏ టాలెంటెడ్ డైరెక్టర్‌తో జతకట్టబోతున్నారనే దానిపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన యువ దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటితో (డేవిడ్ రెడ్డి ఫేమ్) యష్ తదుపరి సినిమా ఉండబోతుందంటూ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఒక్క సినిమా కూడా థియేటర్లలోకి రాకముందే, ఒక కొత్త దర్శకుడికి రాకింగ్ స్టార్ నుంచి పిలుపు వచ్చిందనే ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్‌పై రకరకాల కథనాలు వైరల్ కావడంతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే, ఈ రూమర్స్‌పై తాజాగా స్పష్టత వచ్చింది. యష్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలు ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండించాయి. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో యష్ సినిమా చేయబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ రూమర్స్ మాత్రమేనని స్పష్టం చేశాయి. దీంతో రాకింగ్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి జరుగుతున్న ప్రచారానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది.