మలయాళంలో రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన లోక మూవీలో దుల్కర్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇందులో హీరోయిన్‌గా టాలీవుడ్ లో ఫెడౌట్ అయిన భామ కల్యాణి ప్రియదర్శన్‌ను తీసుకుని అదిరిపోయే హిట్ కొట్టాడు. తెలుగు మూవీ హలోతో వెండితెరకు పరిచయమైన కల్యాణి కొన్నేళ్లుగా తెలుగులో కనిపించలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత కొత్తలోక తో టాలీవుడ్ కు కమ్‌బ్యాక్ ఇచ్చింది. తెలుగులోను ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక హీరోగా లక్కీ భాస్కర్ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్ నటించిన ‘కాంత’ రిలీజ్‌కు రెడీగా వుంది. ఇందులో సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈమె నటించిన ‘మిష్టర్ బచ్చన్’ కింగ్‌డమ్ ప్లాపులే.
Also Read : Rahul Ramakrishna : వరస వివాదాస్పద ట్వీట్స్ చేసి అకౌంట్ డిలీట్ చేసిన నటుడు రాహుల్ రామకృష్ణ
దుల్కర్ మరో కొత్త సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్. పూజా హెగ్డే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. మూడేళ్లుగా తెలుగులో ఒక్క ఆఫర్ లేదు. అయితే దుల్కర్ కరుణించి ఫేడౌట్ భామకు ఛాన్స్ ఇచ్చాడు. అదేమిటోగానీ ఫ్లాప్ అండ్ ఫేడౌట్ హీరోయిన్స్ దుల్కర్‌సల్మాన్‌కు కలిసొస్తున్నారు. నాలుగేళ్లుగా హిట్ లేని మీనాక్షి చౌదరికి ‘లక్కీ భాస్కర్’ హిట్ తీసుకొచ్చింది. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే కు హిట్ ఇచ్చే పనిని దుల్కర్ తీసుకున్నాడు. దుల్కర్ తో చేస్తున్న కాంతతో హిట్ కొట్టి ఐరన్ లెగ్ ముద్ర చెరిపేయాలని భావిస్తోంది భాగ్యశ్రీ బోర్సే. ఇక టాలీవుడ్ పక్కన పెట్టేసిన పూజ హెగ్డే కూడా దుల్కర్ సినిమాతో హిట్ అందుకని తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తోంది. మరి ఈ ఇద్దరి భామల ముద్దుల కోరికను దుల్కర్ నెరవేరుస్తాడో లేదో చూడాలి.
