తమిళ స్టార్ దర్శకులలో AR మురగదాస్ ఒకప్పుడు ముందు వరసలో ఉండేవారు. తుపాకీ, కత్తి, గజనీ, సెవెన్త్ సెన్స్ సినిమాలతో శంకర్ తర్వాత స్థానం మురుగదాస్ అనే పేరు వినిపించింది. కానీ ఆ తర్వాత మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన స్పైడర్ తో ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇక దర్బార్, సికిందర్ ఆయన ఇమేజ్ ను అమాంతం కిందకు దించేసాయి. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సంగతి కనీసం హిట్ కొడితే చాలు అనే పరిస్థితిలో ఉన్నాడు మురుగదాస్. కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం మదరాసి. ఈ నెల 5న రిలీజ్ అవుతోంది.
Also Read : Kollywood : ప్రెజర్ తట్టుకోలేక ప్రొడక్షన్ హౌస్ ను మూసేస్తున్నట్టు ప్రకటించిన స్టార్ డైరెక్టర్
శివకార్తికేయన్ కు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. శివ గత చిత్రం అమరన్ భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఇటీవల కాలంలో తమిళ సినిమాలు తెలుగులో అంతగా మెప్పించలేకపోతున్నాయి. ఇప్పుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘మదరాసి’ సినిమా ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ నెలకొంది. ఇటీవల కాలంలో తమిళ అగ్ర దర్శకులు శంకర్, మణిరత్నం చిత్రాలైన గేమ్ ఛేంజర్’ ‘థగ్ లైఫ్’ తెలుగులో డిజాస్టర్ గా మారాయి. రీసెంట్ గా వచ్చిన లోకేశ్ కనగరాజ్ ‘కూలీ’ కూడా అంతగా మెప్పించలేదు. ఇప్పడు రాబోతున్న మురుగదాస్ ‘మదరాసి’ ఎలా ఉంటుందో అనే ట్రేడ్ సర్కిల్స్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. అమరన్ హిట్ తర్వాత శివకార్తికేయన్ చేస్తున్న సినిమా కావండం, ట్రైలర్ కూడా మెప్పించడం సినిమాపై కొన్ని అంచనాలను పెంచింది. టాలీవుడ్ లో అనుష్క నటించిన ఘాటీ సినిమాతో పోటీగా వస్తున్న మదరాసి మురుగుదాస్ కు హిట్ ఇస్తుందో లేదా సికందర్ లాగా రెండు రోజులకు దుకాణం సర్దేస్తుందో చూడాలి.
