హీరోయిన్లకు సోషల్ మీడియా ఒక వరం. ఆఫర్లను కొల్లగొట్టేందుకు, ఒక ప్రొఫైల్‌గా మారింది. ఫ్యాన్స్‌తో నేరుగా టచ్‌లో ఉండేందుకు ఒక సాధనమైంది. కానీ తమకు శాపంగా మారాయంటున్నారు కొంత మంది స్టార్ భామలు. అందుకే వాటికి దూరంగా జరుగుతున్నారు. ఈ ఏడాది ‘సింగిల్’తో హిట్టు కొట్టేసిన కేతికా శర్మ, ఆగస్టులో సోషల్ మీడియా బ్రేక్ అంటూ అనౌన్స్ చేసింది. కానీ రీజన్స్ ఏంటో చెప్పలేదు అదిలా సర్రైజ్ బ్యూటీ.
Also Read:Mirai – Little Hearts : లిటిల్ హార్ట్స్ ను బతికించిన మిరాయ్ నిర్ణయం..
అనుష్క శెట్టి ఘాటీ ప్రమోషన్లలో మీడియాకు కనిపించకుండా, సోషల్ మీడియాలో వినిపించి సరిపెట్టేసింది. సాధారణంగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని అనుష్క, మళ్లీ తన సొంత ప్రపంచానికి వెళ్లిపోయింది. సామాజిక మాధ్యమాలకు గ్యాప్ ఇచ్చింది. తిరిగి వాస్తవిక ప్రపంచంతో కనెక్ట్ అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్వయంగా ఒక లెటర్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరిన్ని మంచి కథలతో వస్తానని ప్రామిస్ చేసింది స్వీటీ.
అనుష్క ప్రకటించిన మరుసటి రోజు ‘మట్టి కుస్తీ’ ఫేం ఐశ్వర్య లక్ష్మీ కూడా సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేస్తూ లాంగ్ నోట్ పంచుకుంది. ‘ఇండస్ట్రీలో మనుగడ సాగించాలంటే సోషల్ మీడియా నీడ్ అని భావించా. కానీ నా పనిని, నాలో ఉన్న సృజనాత్మకతను ఇది దోచేస్తోంది. చిన్న చిన్న ఆనందాల్ని కిల్ చేసేస్తుంది. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని కోరుకుంటున్నా’ అంటూ ఇన్‌స్టా అకౌంటే క్లోజ్ చేసింది ‘గాడ్సే’ బ్యూటీ. ట్రోల్స్, ఇతర ఇష్యూస్ వల్ల కంటే పర్సనల్‌గా ఏదో కోల్పోతున్నామన్న బాధతోనే సోషల్ మీడియా నుండి క్విట్ అవుతున్నారు భామలు.
