Ustaad Bhagat Singh : ఉస్తాద్ ఈవెంట్ కు తమన్ & దేవి శ్రీ డుమ్మా.. కావాలనే రాలేదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. వేలాది మంది అభిమానులు తరలివచ్చిన ఈ వేడుకలో ఒక లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ‘రాక్ స్టార్’ దేవిశ్రీ ప్రసాద్ అలాగే నేపధ్య సంగీతం అందించిన తమన్ ఈ ఈవెంట్ కి దూరంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read : Bollywood : సినిమా వసూళ్లు దేశ జనాభా కంటే ఎక్కువ ఉంటున్నాయి.. ప్రియదర్శన్ వైరల్ కామెంట్స్!
Also Read
సాధారణంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఏ సినిమా వేడుక అయినా, ఆయన తన మార్క్ ఎనర్జీతో, అదిరిపోయే స్టేజ్ పెర్ఫామెన్స్‌లతో సందడి చేస్తుంటారు. కానీ ఉస్తాద్ ఈవెంట్‌లో ఆయన కనిపించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. దీనికి తోడు, ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఎస్.ఎస్. తమన్ కూడా ఈ వేడుకలో కనిపించలేదు. ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు ఒకేసారి గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. డీఎస్పీ గైర్హాజరుపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సాంగ్స్ డీఎస్పీ కంపోజ్ చేసినప్పటికీ, బీజీఎమ్ బాధ్యతలు తమన్‌కు అప్పగించడం పట్ల దేవిశ్రీ ప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఈవెంట్ కు రాలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, తాను మ్యూజిక్ డైరెక్ట్ చేయని సినిమా వేడుకకు రావడం ఎందుకనే ఉద్దేశంతో తమన్ కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, ఉస్తాద్ వేడుకలో ఈ మ్యూజిక్ మ్యాజిక్ మిస్ అవ్వడం పట్ల సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది.
తాజావార్తలు
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్‌గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..