“అస్సలు వద్దు! ఆమెతో సినిమా చేయవద్దు! తనకి కొంచెం కూడా పని మీద శ్రద్ధ లేదు!” ఇలా చాడీలు చెప్పాడట షారుఖ్ ఖాన్! అదీ మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ కి! ఇంతకీ, కాజోల్ గురించి ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? అదే ట్విస్ట్!
Read Also : సురేఖావాణి@బిగ్ బాస్ 5
‘బాజీగర్’ సినిమాలో నటిస్తుండగా కాజోల్ నటన, ప్రవర్తన ఏదీ నచ్చలేదట కింగ్ ఖాన్ కి. ఆమె మరీ సరదాగా ఉండటంతో పని మీద ఏకాగ్రత లేదని భావించాడట. అదే సమయంలో ఎస్ఆర్కేని ఆమీర్ సలహా అడిగాడట! కాజోల్ తో తాను ఓ సినిమా చేయాలని భావిస్తున్నట్లు చెబితే… ‘వద్దే వద్దని’ తేల్చి చెప్పాడట! కానీ, తీరా షూటింగ్ తరువాత సినిమా రషెస్ వచ్చాక కాజోల్ పర్ఫామెన్స్ ని తెర మీద చూశాడట కింగ్ ఖాన్! ఇంకేముంది, ఫ్లాటైపోయాడు! కాజోల్ గురించి తాను భావించింది అంతా తప్పని గ్రహించిన షారుఖ్ ఖాన్ వెంటనే ఆమీర్ కి ఫోన్ చేసి ‘ఆమె తెర అద్భుతం’ అంటూ కితాబునిచ్చాడట! అయితే, ‘బాజీగర్’ సమయంలో బాద్షాకు అస్సలు నచ్చని కాజోలే తరువాతి కాలంలో ఆయనకు బెస్ట్ జోడీగా మారింది. ఖాన్ అండ్ కాజోల్ నటించిన ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ బాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రొమాంటిక్ మైల్ స్టోన్ గా మిగిలిపోయింది…
