NTV Telugu Site icon

Venkatesh: టెలివిజన్ ప్రీమియర్ సందడి చేయనున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’

February 7 2025 02 22t131819.909

February 7 2025 02 22t131819.909

సంక్రాంతి కానుకగా ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా రూపొందిన ఈ మూవీ.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కడుపుబ్బ నవ్వించింది. కేవలం తెలుగులో మాత్రమే విడుదలైన ఈ చింత్రం, బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది అంటే మాటలు కాదు. ఇక తాజాగా ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ సందడికి సిద్ధం అయ్యింది.

Also Read:Hitchcock: చిరంజీవి చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ సెకండ్ ఎడిషన్ లాంచ్..

మనుకు తెలిసి ఎంత పెద్ద సినిమా అయిన ఈమధ్య కాలంలో థియేట్రికల్‌ రిలీజ్‌ అయిన నాలుగు వారాలకు ఓటీటీలో, రెండు మూడు నెలల తర్వాత టీవీలో ప్రసారం అవుతున్నాయి. కానీ ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రం ఓటీటీ కంటే టెలివిజన్‌లో ప్రీమియర్ కాబోతుంది. ముందుగా జీ తెలుగు ఛానల్‌లో ఈ సినిమాను టెలికాస్ట్‌ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా జీ తెలుగు ప్రకటించింది. మార్చి 1న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ టెలికాస్ట్‌ కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది జీ తెలుగు. అయితే ఈ OTT లు వచ్చిన తర్వాత టీవీ టెలికాస్ట్‌ రేటింగ్‌ దారుణంగా పడిపోతున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు కూడా దారుణంగా రేటింగ్ వస్తుంది. దీంతో జీ ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ పై బోలెడు ఆశలు పెట్టుకుంది.