NTV Telugu Site icon

Devara: సాయంత్రం సంచలనం సృష్టించబోతున్న దేవర.. మీరు రెడీనా..?

Untitled Design (67)

Untitled Design (67)

నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర. ‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీయార్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఈ దఫా ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో పలు హిట్ సినిమాల దర్శకుడు కొరటాల శివ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాడు. భారీ యాక్షన్ చిత్రంగా రానున్న ఈ సినిమా ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

Also Read: Tollywood: ఫస్ట్ వీకెండ్ ముగిసింది.. రీసెంట్ సినిమాల బాక్సాఫీస్ రివ్యూ..?

కాగా ఇటీవల కాలంలో దేవర సినిమా నుండి ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఒకింత నిరుత్సహానికి గురయ్యారు. ఏదైనా అప్ డేట్  ఇవ్వాలని నిర్మాణ సంస్థను టాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. దీంతో దేవర థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, దేవర నిర్మణ సంస్థ ఎన్టీయార్ ఆర్ట్స్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేసారు. దేవర నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. కాగా దేవర సెకండ్ సింగిల్ ను ఈ రోజు సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయబోతున్నట్టు తారక్, జాన్వీలతో కూడిన పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ‘మెల్లగా కొల్లగొట్టడం అంటే ఇది..ఇక తేలిపోవడమే మన వంతు’ అంటూ దేవర సెకండ్ సింగిల్ ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో ఈ పాటపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Show comments